E-Paper
Advertisement

Mr Perfect Re – Release: రకుల్ ప్రీత్ సింగ్ ను తీసేసి కాజల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది.?

Mr Perfect Re – Release: రకుల్ ప్రీత్ సింగ్ ను తీసేసి కాజల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది.?
Advertisement

Mr Perfect Re – Release: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు ఇప్పుడు ఎవరికి ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేరు. కొంతవరకు షూటింగ్ జరిగి కూడా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. మరి కొన్నిసార్లు అవకాశం వచ్చినట్లే వచ్చి తప్పిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ (Mr Perfect). ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించారు. ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమా అద్భుతమైన హిట్ అయింది. ప్రభాస్ లాంటి హీరోతో ఇలాంటి క్లాస్ స్టోరీ కూడా చెప్పొచ్చు అని దశరథ్ ప్రూవ్ చేశాడు. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. పెద్ద హీరోలు పుట్టినరోజులు వస్తున్నప్పుడు వాళ్ల కెరియర్ లో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేయడం అనేది కామన్ గా మారిపోయింది.

ఇక ప్రస్తుతం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాలో కాజల్ (Kajal) తాప్సీ (Tapsee) కీలక పాత్రలో కనిపించారు. మొదట కాజల్ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా అనుకున్నారట. ఒక నాలుగు రోజులు పాటు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా అయింది. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఒక పది రోజుల గ్యాప్ వచ్చింది. అప్పుడు ఈ ఫుటేజ్ చూసిన కొంతమంది కొత్త హీరోయిన్ కాకుండా తెలిసిన వారితో వెళితే బాగుంటుంది అని చెప్పడంతో రకుల్ ను ఈ సినిమా నుంచి తొలగించి రకుల్ (Rakul Preet) ప్లేసులో కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు. ఈ సినిమాతో కాజల్ కి కూడా మంచి పేరు వచ్చింది. కాజల్ తన కెరీర్ లో చేసిన సినిమాలలో ఈ సినిమా మంచి ప్లస్ అయిందని చెప్పాలి. అలా తెలుగులో చేయాల్సిన మొదటి సినిమా రకుల్ చేయలేకపోయారు.

Advertisement

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన తర్వాత రకుల్ నటించిన ఒక కన్నడ సినిమా ఆడియో ఫంక్షన్ కి దశరథ్, ప్రభాస్ ఇద్దరు హాజరయ్యారు. అలానే సినిమా విషయంలో కూడా ఆవిడకి క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా రకుల్ ఫాదర్ తో కూడా మాట్లాడినట్లు రివిల్ చేశాడు దర్శకుడు దశరథ్. ఇక మళ్లీ తెలుగులో కూడా హీరోయిన్ ప్రూవ్ చేసుకుంది రకుల్. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు సరసన కూడా నటించి తెలుగులో మంచి హిట్స్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా బిజీగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో రాజా షాబ్ అనే సినిమాను చేస్తున్నాడు. నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మోసం పిక్చర్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను హర్రర్ కామెడీ జోనర్ లో మారుతి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×