BigTV English

Maharashtra Polls MVA: మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Maharashtra Polls MVA: మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Maharashtra Polls MVA| ఈ సారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రతిపక్ష కాంగ్రెస్, షరద్ పవార్ ఎన్‌సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీల కూటమికి సవాల్ గా మారింది. దీంతో ఇండియా కూటమిలో భాగస్వాములైన ఈ మూడు పార్టీలు కూడా తమ మధ్య ఎన్ని విభేదాలున్నా.. చివరికి ఒక డీల్ కుదుర్చుకున్నాయి. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఈ మూడు పార్టీలు కూడా సీట్ల సర్దుపాటు దాదాపు ముగించేశాయి. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి పేరుతో ఎన్నికల బరిలో దిగుతున్న ఈ మూడు పార్టీలు త్వరలో జరుగబోయే ఎన్నికల్లో 85-85 షేరింగ్ ఫార్ములా ప్రకారం సీట్లు పంచుకోబోతున్నట్లు ప్రకటించాయి. అంటే మూడు పార్టీలు కూడా తలా 85 సీట్లల పోటీ చేయబోతున్నట్లు ఉద్ధవ్ శివసేన పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ బుధవారం సాయంత్రం ప్రకటించారు.


మీడియా ప్రతినిధుల సమావేశంలో సంజయ్ రౌత్, కాంగ్రెస్ పార్టీ నానా పటోల్ మాట్లాడారు. “మహారాష్ట్రలోని మొత్తం 288 సీట్లలో మహావికాస్ అఘాడీలో భాగస్వాములైన మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు ఒప్పందం కుదిరింది. మూడు పార్టీలు కూడా 85-85-85 ఫార్ములా ప్రకారం సీట్లు పంచుకోవాలని నిర్ణయించాయి. మొత్తం 270 సీట్లలో మహావికాస్ అఘాడీ నేతలు పోటీ చేస్తారు. మిగతా 18 సీట్లు ఇండియా కూటమి సన్నిహిత పార్టీలక కేటాయించడం జరుగుతుంది. ” అని సంజయ్ రౌత్ ఇంగ్లీషులో ప్రకటించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు నానా పటోల్ హిందీ చెప్పారు.

Also Read: లారెన్స్ బిష్నోయిని చంపితే రూ.కోటి పదకొండ లక్షలు.. బహిరంగ ప్రకటన చేసిన కర్ణిసేన..


మీడియా ప్రతినిధులు సీట్లు 85-85 ఫార్ములా ప్రకారం.. మొత్తం 255 అవుతాయి కదా? మరి 270 ఎలా అని ప్రశ్నించగా.. 15 సీట్లు మహారాష్ట్రలోని చిన్న పార్టీలకు కేటాయిస్తామని సమాధానం చెప్పారు. ఒకవేళ వారు అంగీకరించకపోతే ఆ 15 సీట్లు కూడా మూడు పార్టీలే ఒక నిర్ణయం ప్రకారం పోటీ చేస్తాయని తెలిపారు.

అయితే ఆ 15 సీట్లలో మూడు పార్టీల మధ్య రాజీ కుదరలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యంగా ముంబై, నాశిక్, విధర్భా ప్రాంతాలలోని దక్షిణ నాగ్‌పూర్, అమ్రావతి, ముంబైలోని ఘాట్ కోపర్ వెస్ట్, బైకుల్లా, కుర్లా, వర్సోవా, బాంద్రా ఈస్ట్, పరోలా, నాశిక్ వెస్ట్ సీట్లపై మూడు పార్టీలు కూడా పట్టబడుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అంతకుముందు మంగళవారం రాత్రి మూడు పార్టీల ప్రతినిధులు కూడా అర్ధరాత్రి నుంచి తెల్లవారుఝామున వరకు సీట్ల సర్దుబాటు వరకు సీరియస్ గా చర్చించారు. చివరికి ఎన్‌సీపీ నాయకుడు షరద్ పవార్ సంధి కుదర్చడానికి ప్రయత్నించారు. ముందుగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన తమకు 100, కాంగ్రెస్ కు 100 సీట్లు మిగతా 88 షరద్ పవార్ నేషనలిస్ట్ పార్టీకి అని ప్రస్తావించింది. లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన సీట్ల శాతం ఆధారంగా పంచుకోవాలన్ని చెప్పింది. కానీ అందుకు ఎన్సీపీ కాస్త బేరసారాలు జరిపి 85-85 ఫార్ములాతో చర్చలు ముగించింది.

మూడు పార్టీల్లో కూడా తొలిగా ఉద్దవ్ ఠాక్రే శివసేన 65 అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20, 2024న జరుగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×