BigTV English

Dulquer Salmaan : రంగస్థలం సినిమా తర్వాత ఇప్పటివరకు దుల్కర్ కు ఏ సినిమా నచ్చలేదా.?

Dulquer Salmaan : రంగస్థలం సినిమా తర్వాత ఇప్పటివరకు దుల్కర్ కు ఏ సినిమా నచ్చలేదా.?

Dulquer Salmaan : ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అంతా ఇండియన్ సినిమా అని మాట్లాడటం మొదలుపెట్టారు. దీనికి కారణం ప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. ఇలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి ముందు చాలామంది సినిమా ప్రేమికులు ఇతర భాషల్లోని సినిమాలను కూడా ఓటీటీలో వీక్షించేవారు. మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ చేసిన చాలా సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా చూశారు. ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు దుల్కర్.


హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో మంచి గుర్తింపును అందుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. హను ఈ సినిమాని డిజైన్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమాను చేస్తున్నాడు దుల్కర్. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద కూడా అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కూడా విపరీతంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి సబ్జెక్ట్ తో సినిమా రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమా గురించి ఎవరైనా నెగిటివ్ గా చెప్తే వాళ్లతో పిలిచి మాట్లాడుతాను అని కూడా చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి సినిమా మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నాడు దుల్కర్ సల్మాన్. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రీసెంట్ టైమ్స్ లో మీకు నచ్చిన సినిమా ఏంటి అని అడిగినప్పుడు రంగస్థలం అనే సినిమా పేరు చెప్పాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలం. రామ్ చరణ్ లోని ఒక పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసిన సినిమా రంగస్థలం అని చెప్పాలి. రంగస్థలం సినిమా తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చాయి. కానీ దాదాపు ఆరేళ్ల క్రితం రిలీజ్ అయిన రంగస్థలం తర్వాత దుల్కర్ కి మరో సినిమా నచ్చలేదా.? అని అందరూ చర్చలు మొదలుపెట్టారు. దుల్కర్ నటించిన మహానటి,సీతారామం,కల్కి వంటి సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి.


లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి BIGTV Whats APP Channelని ఫాలో అవ్వండి. ఈ కింద లింక్ క్లిక్ చేయండి 👇

https://whatsapp.com/channel/0029VaAe49e72WTw8YM6zr3q

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×