Mrunal Thakur:మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హిందీ సీరియల్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె, ఆ తర్వాత హిందీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. అలా హిందీ సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్న ఈమె..తెలుగులో హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సినిమాలోనే చీరకట్టులో సాంప్రదాయంగా కనిపించి, అందరి మనసులు దోచుకుంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ హృదయాలను హత్తుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పలు సినిమాలలో నటించి అబ్బురపరిచింది. ఇక అలా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా పెద్దగా గుర్తింపును అందివ్వలేదు.
అక్కినేని హీరో ప్రేమలో మృణాల్ ఠాకూర్..
ఇకపోతే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi)కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఈమెకు అవకాశం లభించిందని వార్తలు వినిపించాయి. కానీ ఈమె పారితోషకం ఎక్కువగా డిమాండ్ చేయడం వల్లే ఈ సినిమా నుండి ఈమెను తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈమె అక్కినేని(Akkineni ) ఇంటికి కోడలు కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని సుమంత్ (Akkineni Sumanth) తో ఈమె చనువుగా కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇక త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు తెగ జోరుగా ప్రచారం అవుతూ ఉండడం గమనార్హం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అక్కినేని ఇంటికి కోడలు కాబోతోంది అంటూ వస్తున్న వార్తలు మాత్రం అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
సుమంత్ కెరియర్..
ఇక అక్కినేని హీరో సుమంత్ విషయానికి వస్తే.. యార్లగడ్డ సుమంత్ కుమార్.. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద మనవడు.. అన్నపూర్ణ స్టూడియోలో ఈయన భాగస్వామి కూడా.. ప్రేమ కథ, యువకుడు, సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్ వంటి చిత్రాలు ఈయనకు మంచి గుర్తింపును అందించాయి. అక్కినేని పెద్ద కుమార్తె సత్యవతి, అక్కినేని సురేంద్ర యార్లగడ్డ దంపతులకు జన్మించిన ఈయన తన తాత అక్కినేని నాగేశ్వరరావు దగ్గరే పెరగడంతో.. వారి కుటుంబంలోనే వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్నారు. అందుకే తాతకు పెద్ద మనవడిగా తాత దగ్గరే ఉంటూ నటనలో శిక్షణ తీసుకొని నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక సుమంత్ విషయానికి వస్తే.. కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్న ఈయన పెళ్లయిన కొంతకాలానికి ఆమెతో విడిపోయి ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అటు కీర్తి రెడ్డి డాక్టర్ ను వివాహం చేసుకొని విదేశాలలో సెటిల్ అయినట్లు సమాచారం. ఇకపోతే వీరిద్దరు విడాకులు తీసుకొని వేరుపడినా.. ఇప్పటికీ స్నేహితులుగానే కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒంటరిగా ఉంటున్న అక్కినేని హీరో ఇప్పుడు మృనాల్ ఠాకూర్ తో ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి
ఇక మరి ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.