Illu Illalu Pillalu Today Episode may 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజును అందరు అవమానించారు. ఆ ఆ విషయం వల్ల సీరియస్ అయిన రామరాజు ధీరజ్ ప్రేమను మా రూమ్ లో ఉండండి అని చెప్తాడు.. శ్రీవల్లి మాత్రం నేను చేతపడేటప్పుడు స్టోర్ రూమ్ చూశానండి ఆ చిన్న గది మాకు చాలు అని అంటుంది. అదే స్టోర్ రూమ్ లో మేము ఉంటామని ధీరజ్ ప్రేమలు అంటారు. శ్రీవల్లి మాత్రం స్టోర్ రూమ్ లో మేము ఉంటాము మీరు మా రూంలో ఉండండి అనేసి అంటుంది.. ధీరజ్ స్టోర్ రూమ్ లో మేము ఉంటాము అని చెప్తాడు. మొత్తానికి శ్రీవల్లి ప్లాను వర్కౌట్ అవుతుంది. ఒక కోడల్ని స్టోర్ రూమ్ కు పంపించాను. ఇక రెండో కోడలు సంగతి చూస్తే నేనే ఇంటికి మహారాణి అని శ్రీవల్లి అనుకుంటుంది.. ధీరజ్, ప్రేమలు ఇద్దరినీ శ్రీవల్లి ప్లాన్ ప్రకారం స్టోర్ రూమ్ కు పంపిస్తుంది.. నర్మద సాగర్ ని కూడా ఈ ఇంట్లోంచి పంపించాలని మరో ప్లాన్ వేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు మిల్లు ఓపెన్ చేయక నాలుగు రోజులైంది అని హడావిడిగా మిల్లుకు వెళుతూ ఉంటాడు. భాగ్యం అప్పుడే ఫోన్ చేసి మీరందరూ కలిసి 16 రోజులు పండక్కి అల్లుడుగారిని అమ్మాయిగాన్ని తీసుకొని రావాలని అడుగుతుంది.. మేము అందరం కలిసి వస్తాము అనేసి అంటుంది..వేదవతి ధీరజ్ ప్రేమలను రెడీ అవమని చెప్తుంది. ప్రేమ నర్మద వెళుతుంటే నర్మద దగ్గరికి వెళ్తుంది. తేడాగా ఉన్నారు నేను వెళ్ళను అని అంటుంది ప్రేమ. వీళ్లకు తప్పదు ప్రేమ నాకు సెలవు ఉన్నా కూడా నేను వెళ్ళను అని అంటుంది నర్మదా. ప్రేమ చీర కట్టుకోవాలా డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ధీరజ్ చీర కట్టుకొని చెప్తాడు..
ప్రేమ చీర కట్టుకోవాలా చుడిదార్ వేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ధీరజ్ వచ్చి మొత్తానికి చీర కట్టుకోమని సెలెక్ట్ చేసి ఇస్తాడు. ఇక ప్రేమ దిన చెప్పినట్లు చీర కట్టుకుంటుంది.. అయితే చీర కట్టుకోవడానికి ముందు చీర కట్టుకోవాలంటే ఎంత టైం తీసుకుంటారో మాకు తెలుసు అదే మేం మగవాళ్ళము అలా చేతి దొరికిన ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తామని అంటాడు. అది విన్న ప్రేమ కోపంతో రగిలిపోయి ధీరజ్ కి చీర గురించి ఆడవాళ్ళ రెడీ గురించి పెద్ద క్లాసే పీకుతుంది.. ధీరజ్ అమ్మ మీరే గ్రేట్ అని ఒప్పుకొని వెళ్తాడు. ప్రేమ రెడీ అయిన తర్వాత జాకెట్ హుక్కు పట్టలేదని అందరిని పిలుస్తుంది. నేను సరి చేస్తాను అని దాన్ని సరి చేస్తాడు.
ఇక శ్రీవల్లి రెడీ అయిందా లేదా అని చందు రూమ్ లోకి వస్తాడు. శ్రీవల్లి నగలని బ్యాగ్ లో పెట్టడం చూసి ఈ నగలేంటి మీ అమ్మతో నగల గురించి మాట్లాడుతున్నావ్ ఏంటి అని అడుగుతాడు. హాయ్ బాబాయ్ ఈ నగలు గురించి ఆయనకి నిజం తెలియలేదు దొరికిపోయాను అనుకున్నాను అని కాసేపు టెన్షన్ పడుతుంది. శ్రీవల్లి ఇక్కడ ఇన్ని నగలు పెడితే దొంగలుంటారని మా అమ్మ లాకర్లో పెడతాను తీసుకు రమ్మని చెప్పింది మరి ఈ నగలను తీసుకెళ్లానా బావ అని అడుగుతుంది. చందు నీ నగలు నీ ఇష్టం అని అనగానే శ్రీవల్లి సంతోషపడుతుంది.
వల్లి చాలా టైం అయింది రెడీ అయ్యావా నువ్వు అని చందు అడుగుతాడు. ఈ పూలు నా తల్లో పెట్టు బావ అంటే చందు సిగ్గుపడతాడు భార్య తల్లో పూలు పెట్టడం పెద్ద నేరం ఏమి కాదు కదా పెట్టు బావ అని శ్రీవల్లి అడుగుతుంది. అప్పుడే కామాక్షి ఫైనాన్స్ మరదలు అంటూ వస్తుంది. చందు పూలు పెట్టడం చూసి షాక్ అవుతుంది. ఇలాగే నువ్వు భార్య చెప్పిన మాట వింటే నీకు కొంగును కట్టేసుకుంటారు నేను నా భర్త నల్లని కొంగును కట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎలా చెప్తే అలా నా వెనకాల తిరుగుతున్నాడు చూసావా అని అంటుంది.
ఇదిగో ఫైనాన్స్ మరదలు గారు నువ్వు ఆడపడుచు కట్నం ఇంకా తీసుకురాలేదు. మీ అమ్మని అడిగి నాకు ఆడపడుచు కట్నం తీసుకొని రావాలి అని అడుగుతుంది.. మా అమ్మ చెప్పినట్టు ఇంట్లో వాళ్ళందరినీ బుట్టలు వేసుకోవాలని చెప్పింది కదా ముందు ఈమెను బుట్టలో వేసుకోవాలి అని ఒక నగతీసి ఇస్తుంది. ఇది దగ్గర 10 లక్షలు ఉంటుంది కదా ఈ పదివేల 20 వేలు ఇస్తామంటే ఇంత ఖరీదని నగలు ఇచ్చావా అని సంతోషంతో కామాక్షి అందరికీ చూపిస్తానని వెళ్ళిపోతుంది..
నర్మదా సాగర్ లో బైక్ మీద వస్తుంటారు. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్లడం నీకు ఇష్టం లేకే కదా సెలవులు లేవని చెప్పావు నాకు అర్థం అయిపోయిందిలే అని సాగర్ అంటాడు. మీకు అర్థమైంది బాగానే.. పెద్ద సైంటిస్ట్ లాగా హారాలు తీస్తున్నారు నాకు నిజంగానే సెలవలు లేవు పెళ్లి కోసం వాడేసాను కదా అందుకే సెలవు పెట్టలేదు. అయితే కనీసం ఆఫ్ డే అన్నా సెలవు పెట్టుకొని వెళ్లాల్సి ఉంది కదా అని సాగర్ అంటాడు. కానీ నర్మద మాత్రం వాళ్ళ ఫ్యామిలీ గురించి చెబుతూ వాళ్ళ ఫ్యామిలీ ఏదో తేడాగా ఉంది నాకు అసలు నచ్చలేదు ఎందుకొచ్చిన బాధ నాకు అక్కడికి వెళ్తే నోరు ఊరుకోదు కదా అని అంటూ ఉంటుంది.
అప్పుడే ఆనంద్ రావు ఇడ్లీలు తీసుకొని ఆ సెంటర్లో పెట్టి అమ్ముతూ ఉంటాడు.. నర్మదా అతని చూసి సాగర్ ని బైక్ ఆఫ్ అని చెప్తుంది. వీళ్ళని చూసిన ఆనందరావు అక్కడి నుంచి పక్కకు వెళ్లి దాక్కుంటాడు. నర్మదా కు మాత్రం అనుమానం ఉంటుంది. ఆ మాట నువ్వు ఎందుకు నమ్మవు సాగర్ అని వాళ్ళిద్దరూ కాసేపు గొడవపడతారు. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే మన వాళ్ళ ఇంటికి వెళ్లాలని వాళ్ళిద్దరు బండిపై వెళ్ళిపోతారు. ఆనందరావు కూడా ఈ విషయం బయట పడితే నా పరిస్థితి అంతేనని పరిగెత్తుకుంటూ వెళ్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.