BigTV English

Mrunal Takur:  మృణాల్ ఠాకూర్ లో స్పెషల్ టాలెంట్.. గ్రేట్ కదా..!

Mrunal Takur:  మృణాల్ ఠాకూర్ లో స్పెషల్ టాలెంట్.. గ్రేట్ కదా..!

Mrunal Takur: టాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి సినీ అభిమానుల గుండెల్లో అభిమాన్ని పొందింది. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కేవలం మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. ప్రస్తుతం తెలుగు టాప్ హీరోయిన్ల లిస్ట్ ఈమె కూడా ఒకరు. గతంలో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీ చేసింది. అది యావరేజ్ టాక్ అందుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీ ఆమె లైఫ్ లో బిగ్గెస్ట్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చింది.. అక్కడ కూడా సక్సెస్ అయ్యింది. యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెలో ఒక స్పెషల్ టాలెంట్ ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


మృణాల్ ఠాకూర్ ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ ను అందుకుంది. కానీ మొదటి మూవీ ప్రభావమే ఇంకా జనాల్లో ఉంది. అందుకే ఆమెను ఇప్పటికి ముద్దుగా సీత అని పిలుచుకుంటారు. తెలుగు, అటు హిందీ రెండు భాషలను కవర్ చేస్తూ సత్తా చాటున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగులో నెక్స్ట్ సినిమాపై క్లారిటీ రాలేదు. అంతకుముందు రెండు హిట్లు పడగా విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ పడగానే అమ్మడిని పక్కన పెట్టారు మేకర్స్.. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది.

నెక్స్ట్ సినిమా విషయంలో మృణాల్ కావాలనే టైం తీసుకుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉంటే మృణాల్ బాలీవుడ్ కెరీర్ కూడా బాగానే సాగుతుంది. అక్కడ ఇక్కడ అమ్మడి పాపులారిటీ అదిరిపోతుంది.. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈమె ఏదైనా స్పెషల్ గా నేర్చుకోవాలని అనుకుంది. తను చేసిన త్రెడ్ వర్క్ ని చూపించి హలో మై న్యూ బేబీ అంటూ అనౌన్స్ చేసింది. మన దేశంలో ఎక్కువమంది ఇంట్లో ఉండే మహిళలు చాలా ఇష్టంగా చేసేది కుట్లు అల్లికలే.. అదే ఈ అమ్మడు కూడా నేర్చుకుంది. అమ్మాయిగా ఇలాంటివి తప్పవు అని మృణాల్ అంటుంది. ఆ థ్రెడ్ వర్క్ గురించి సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నీ టాలెంట్ అదుర్స్ అంటూ పొగిడేస్తున్నారు.


ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే.. అడివి శేష్ తో డెకాయిట్ సినిమా ఛాన్స్ అందుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. సినిమాలో తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్న అమ్మడు కెరీర్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలని చూస్తుంది. ఇక కొలీవుడ్ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసింది… తెలుగులో ఓ ప్రాజెక్టు కు చర్చలు జరుగుతున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×