OTT Movie : మనిషి జీవితంలో కష్టాలు ఒక భాగం మాత్రమే. అవి వచ్చినప్పుడు కుంగిపోవడం కంటే, వాటిని దీటుగా ఎదుర్కొంటేనే సక్సెస్ అనేది ముందుకు వస్తుంది. సినిమాలలో రెండు గంటల వ్యవధిలోనే ఈ సక్సెస్ చూపిస్తారు. అయితే అది సినిమా, ఇది జీవితం అనుకుంటూ ఉంటారు చూసేవాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ చూస్తే మీ ఆలోచన మారవచ్చు. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
ఆపిల్ టీవీ (Apple TV) లో
ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘కోడా‘ (CODA). 2021లో విడుదలైన ఈ మూవీకి సియాన్ హెడర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎమిలియా జోన్స్, రూబీ రోస్సీగా నటించారు. వినికిడి, మూగ సమస్య ఉన్న ఒక కుటుంబంలో ఒక అమ్మాయికి మాత్రమే ఆ సమస్య ఉండదు. ఆమె తన ఆశయాలను కొనసాగిస్తూ, తన కుటుంబం కష్టాల్లో ఉన్న ఫిషింగ్ వ్యాపారంలో సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. CODA తన ప్రపంచ ప్రీమియర్‌ను జనవరి 28, 2021న 2021 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించింది. ఇక్కడ ఆపిల్ దాని పంపిణీ హక్కులను $25 మిలియన్లకు కొనుగోలు చేసింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆపిల్ టీవీ (Apple TV) లో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరోయిన్ చేపలు పట్టుకుని అమ్ముకునే ఒక పేద కుటుంబంలో జన్మిస్తుంది. తల్లి, తండ్రి, అన్నయ్య ముగ్గురికి మూగ, చెవుడు ఉంటుంది. హీరోయిన్ ఒక్కదానికి మాత్రమే ఈ ప్రాబ్లం ఉండదు. ఇంట్లో తల్లిదండ్రులకు హెల్ప్ చేస్తూ, స్కూల్ కి వెళ్తూ చదువుకుంటూ ఉంటుంది. అయితే నిద్ర సరిపోకపోవడంతో స్కూల్లో నిద్రపోతుంది. స్కూల్లో ఈమెను చాలా మంది ఎగతాళి చేస్తూ ఉంటారు. అయినా వాటిని తట్టుకొని మ్యూజిక్ క్లాస్ కి అటెండ్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులకు హెల్ప్ చేస్తూ, మ్యూజిక్ క్లాస్ కి వెళ్తూ, మళ్లీ ఇంటికి వచ్చి చదువుకుంటూ తన లైఫ్ ని కష్టాలతోనే స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో తల్లిదండ్రులకు ఉన్న లోపం కారణంగా, చేపలు పట్టే బోట్ లైసెన్స్ ని రద్దు చేస్తారు అధికారులు.
ఆ తర్వాత ఆ షిప్ లో నేను కూడా ఉంటాను అంటూ, అధికారులను ఒప్పించి లైసెన్స్ ని తిరిగి తెచ్చుకుంటుంది. తనకు కుటుంబం ఎంత ముఖ్యమో ఈ మూవీలో అద్భుతంగా చూపించారు. తన పార్ట్నర్ హీరోతో కలిసి, సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇలా చివరికి స్కూల్ కాంపిటీషన్లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంది. ఈమె గురించి తెలుసుకున్న ప్రముఖులు ఆమెతో సాంగ్స్ పాడించాలనుకుంటారు. చివరికి హీరోయిన్ సింగర్ గా మారుతుందా? తమ కుటుంబ కష్టాలు తీరుతాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆపిల్ టీవీ (Apple TV) లో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతున్న ‘కోడా’ (CODA) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.