Mrunal Thakur : కంగనా రనౌత్ (Kangana Ranaut) లీడ్ రోల్ పోషించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) మూవీ గత నెల థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని, ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ కంగనా రనౌత్ ను నిరాశపరిచింది. అయితే తాజాగా యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తాజాగా కంగనా రనౌత్ పై, ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’పై ప్రశంసల వర్షం కురిపించింది. తన అభిమాన నటి అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేసింది.
‘ఎమర్జెన్సీ’పై మృణాల్ రివ్యూ
“మా నాన్నతో కలిసి ఎమర్జెన్సీ మూవీని చూశాను. ఈ సినిమా ఇచ్చిన ఫీల్ నుంచి ఇంకా బయట పడలేకపోతున్నా. కంగనా అభిమానిగా ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై చూడడం సంతోషంగా అనిపిస్తుంది. ఆమెకి ఇది అద్భుతమైన సక్సెస్ అని చెప్పొచ్చు. ‘గ్యాంగ్ స్టర్’ నుంచి ‘క్వీన్’ వరకు… ‘తను వెడ్స్ మను’ నుంచి ‘మణికర్ణిక’, ‘తలైవి’ వరకు తాజాగా ‘ఎమర్జెన్సీ’… ఇలా నిరంతరం ఆమె నటనలో అద్భుతమైన ప్రతిభతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది” అంటూ కంగనాపై అభిమానాన్ని చాటుకుంది.
“ఈ సినిమాలో ఉన్న కాస్ట్యూమ్స్, కెమెరా యాంగిల్స్… ఇలా ప్రతి అంశం ఆకట్టుకుంది. అలాగే కంగనా దర్శకురాలిగా కూడా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసింది. సంగీతం, మాటలు, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. కంగనాతో పాటు మిగతా నటీనటులంతా ఇందులో అద్భుతంగా నటించారు. కంగనా కేవలం నటి మాత్రమే కాదు నిజమైన కళాకారుని. ఛాలెంజెస్ ఉన్న పాత్రను పోషించడంలో ఆమె ధైర్యం నిజంగా ప్రశంసనీయం. ఎవరైనా ఈ సినిమా చూడకపోతే కచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. భారతీయులంతా తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. మూవీని చూశాక కచ్చితంగా ఎమోషనల్ గా థియేటర్ నుంచి బయటకు వస్తారని నేను గ్యారెంటీ ఇస్తున్నాను” అంటూ మూవీపై కంప్లీట్ రివ్యూ ఇచ్చేసింది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).
ఇన్ని రోజులు ఏమైపోయిందో ?
కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘ఎమర్జెన్సీ’ (Emergency). అలాగే ఇందులో కంగనా మెయిన్ లీడ్ గా నటించింది. మాజీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పరిపాలనలో ప్రకటించిన ఎమర్జెన్సీ పరిస్థితి ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జై ప్రకాష్ నారాయణ పాత్రలో, అటల్ బిహారీ వాజ్పేయి గా శ్రేయాస్ తల్పాడే నటించారు. ఇక ఈ మూవీ జనవరి 17న రిలీజ్ అయింది. డిజాస్టర్ టాక్ కూడా తెచ్చుకుంది. అయితే ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), మూవీ రిలీజ్ అయ్యి, నెల రోజులు పూర్తి కావస్తున్న తరుణంలో తన రివ్యూ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. పైగా మూవీని చూసి డిసప్పాయింట్ కారు అంటూ ఇప్పుడు ప్రమోషన్లు మొదలు పెట్టడంతో ఆశ్చర్యపోతున్నారు మూవీ లవర్స్.