Raw Garlic: వెల్లుల్లి దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపయోగిస్తారు. దీనిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది సహజ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది . అంతే కాకుండా శరీరానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కానీ రాత్రిపూట వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుందని మీకు తెలుసా ?
వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదం, ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం రాత్రిపూట వెల్లుల్లి తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. మరి ఇందుకు గల కారణాలు, పూర్తి విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ సంబంధిత సమస్యలు:
వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలతో పాటు ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేయడానికి పనిచేస్తాయి. కానీ రాత్రిపూట తింటే అసిడిటీ, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అసిడిటీ, కడుపు నొప్పి సమస్య పెరుగుతుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు రావడానికి వెల్లుల్లి ప్రేరేపిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు తరచుగా వెల్లుల్లి తింటే మరింత సమస్య పెద్దదిగా మారుతుంది.
నిద్రపై ప్రభావం:
వెల్లుల్లి వాసన , దానిలో ఉండే మూలకాలు నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. అంతే కాకుండా ఇది రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోకుండా చేస్తుంది. మీకు ఇప్పటికే నిద్ర సంబంధిత సమస్యలు ఉంటే మాత్రం రాత్రిపూట వెల్లుల్లి తినడం వల్ల మీ సమస్య మరింత పెరుగుతుంది. నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడే వారు వీలైనంత వరకు వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిది.
వాసన:
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది నోటి నుండి బలమైన దుర్వాసనను కలిగిస్తుంది. రాత్రిపూట వెల్లుల్లి తినడం వల్ల మీ శ్వాసలో చెడు వాసన వస్తుంది. రాత్రి పూట వెల్లుల్లి తింటే మీరు ఉదయం నిద్ర లేచాక మీకు వింతగా అనిపిస్తుంది. అంతే కాకుండా మీ చుట్టూ ఉన్నవారు కూడా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది.
లో బీపీ :
వెల్లుల్లి సహజ రక్తాన్ని పలుచగా చేస్తుంది. అంటే, ఇది రక్తాన్ని పలుచగా చేసి రక్తపోటును తగ్గిస్తుంది. మీరు ఇప్పటికే లో బీపీ కోసం మందులు వాడుతుంటే గనక రాత్రిపూట వెల్లుల్లి తినడం వల్ల తల తిరగడం, బలహీనత , తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. లో బీపీ సమస్య ఉన్న వారు వీలైనంత వరకు వెల్లుల్లి తినకుండా ఉండటం మంచిది.
అలెర్జీ :
కొంతమందికి వెల్లుల్లి తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇది వారి శరీరంపై దురద, మంటతో పాటు దద్దుర్లు కలిగిస్తుంది. రాత్రిపూట వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో అలెర్జీలు పెరుగుతాయి. దీనివల్ల మీకు నిద్ర పట్టకపోవచ్చు. కాబట్టి మీరు వెల్లుల్లి తినాలనుకుంటే పగటిపూట మాత్రమే తినండి. రాత్రిపూట పచ్చి వెల్లుల్లి తినకుండా ఉండండి. ఎందుకంటే అది ఎక్కువ హాని కలిగిస్తుంది. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా వెల్లుల్లి తినే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.