Ram Charan.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అటు రామ్ చరణ్ (Ram Charan) ఇటు అల్లు అర్జున్(Allu Arjun) ఎవరికి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నా.. ఇద్దరు ఒకే కుటుంబం నుంచి వచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తమ నటనతో ప్రేక్షకులను మెప్పించి ఒకరు గ్లోబల్ స్టార్ గా.. మరొకరు పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా అల్లు – మెగా కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నా.. వీరు మాత్రం అవన్నీ రూమర్స్ అంటూ కొట్టి పారేస్తున్నారు. పైగా ఫ్యామిలీ ఈవెంట్స్ లో కలిసి ఒకచోట చేరి సందడి చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో సడన్ గా రాంచరణ్.. అల్లు అర్జున్ ని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అన్ ఫాలో చేయడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. బావ బామ్మర్దిగా ఎప్పుడూ చనువుగా ఉంటారు. అలాంటిది రామ్ చరణ్.. అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నెటిజెన్స్ లో కొత్త అనుమానాలు..
గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మధ్య కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఒక హీరో గురించి మరో హీరో అభిమానులు అసభ్యంగా కామెంట్లు చేస్తూ.. ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. పైగా ఇద్దరు హీరోలు కూడా ఎవరికి వారు భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇలాంటి సమయంలో ఈగో సమస్యలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు అని నెటిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తండ్రిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్స్..
ఇదిలా ఉండగా ఇటీవల ఫిబ్రవరి 9వ తేదీన విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి(Chiranjeevi) రాజకీయాల గురించి కూడా కాస్త మాట్లాడారు. ఆ సమయంలో అల్లు అర్జున్ అభిమానులు చిరంజీవిని పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. దీనికి తోడు బ్రహ్మానందం (Brahmanandam) తన కొడుకు గౌతమ్ రాజా (Gautam Raja) తో కలిసి నటిస్తున్న ‘బ్రహ్మ ఆనందం’ సినిమా ఈవెంట్లో కూడా సరదాగా చేసిన కామెంట్లను నెగిటివ్గా తీసుకొని పోర్ట్రైట్ చేస్తున్న నేపథ్యంలో కాస్త హర్ట్ అయ్యారని, అందుకే అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఫాలో అవ్వకపోయినా అనుమానమే..
ఇకపోతే అన్ ఫాలో చేశారు అనే విషయం కాస్త పక్కన పెడితే.. రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న ఫాలోవర్స్ లో కేవలం 38 మాత్రమే ఉన్నారు. అందులో అల్లు శిరీష్ (Allu Sirish) ఉన్నారు. కానీ అల్లు అర్జున్ (Allu Arjun) లేరు. తమ్ముడిని ఫాలో చేసిన రామ్ చరణ్ అన్నను ఎందుకు ఫాలో చేయడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
రామ్ చరణే కాదండోయ్ బన్నీ కూడా..
ఇకపోతే రామ్ చరణ్ మాత్రమే అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశారని లేదా ఆయన అసలు అల్లు అర్జున్ ని ఫాలో అవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అటు అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ ఖాతాని చెక్ చేస్తే.. ఆయన కేవలం ఒకే ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతూ ఉండడం గమనార్హం. అందులోను ఆయన సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy ) ని మాత్రమే తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా బన్నీ ఫాలో అవుతున్నారు. దాదాపు 28.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అల్లు అర్జున్ కేవలం తన భార్యను మాత్రమే ఫాలో అవుతుండడంతో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఒకే కుటుంబానికి చెందిన వారు పైగా ఇండస్ట్రీకి చెందినవారు ఇలా ఒకరికొకరు ఫాలో అవ్వకపోవడంపై ఈగో సమస్యలే అని నెటిజెన్స్ నిర్ధారణకు వస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై పూర్తి నిజాలు తెలియాల్సి ఉంది.