Mrunal Thakur :మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. సీరియల్ నటిగా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత తెలుగులో హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ప్రముఖ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquar Salman) తొలిసారి నేరుగా చేసిన తెలుగు సినిమా కావడం గమనార్హం. మొదటి సినిమాతోనే సీతగా తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమా తర్వాత ‘హాయ్ నాన్న’, ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాలలో నటించింది మృణాల్ ఠాకూర్. నిజానికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కానీ ది ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఒక్క సినిమా ఈమెకు అవకాశాలు లేకుండా చేసింది. స్టార్ హీరోలు ఈమెను పక్కన పెట్టారనుకుంటే యంగ్ హీరోల సినిమాలలో కూడా ఈమెకు అవకాశాలు రాలేదు.
ఒక్క సినిమాపై మృణాల్ తెలుగు కెరియర్ ఆధారపడిందా?
కానీ శృతిహాసన్ (Shruti Haasan)పుణ్యమా అని ఆమె అడవి శేష్ (Adavi shesh) ‘డెకాయిట్’ మూవీ నుండీ తప్పుకోవడంతో ఆస్థానంలో ఈమెకు అవకాశం లభించింది. ఇక ప్రస్తుతం ఈమెకు తెలుగులో ఉన్న ఒకే ఒక్క సినిమా కూడా ఇదే. ఈ సినిమా డిసెంబర్ కి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో పాటు హిందీలో వచ్చిన ఏ సినిమాని వదులుకోకుండా చేస్తోంది. ఇకపోతే గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు సినిమా స్టోరీ విన్న వెంటనే రెమ్యూనరేషన్ ఎంత అని అడిగేదట. పైగా తన డిమాండ్ మేరకు ఇవ్వాలని చెప్పేదట. అయితే ప్రస్తుతం తెలుగులో కెరియర్ స్ట్రాంగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే రెమ్యునరేషన్ గురించి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదని సమాచారం.
దెబ్బకు దిగివచ్చిన మృణాల్ ఠాకూర్..
దీనికి తోడు అవకాశాలు లేవు. పైగా ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు వస్తుండడంతో.. ఫ్లాప్ హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వడం లేదు. అందుకే హీరోయిన్ ఎవరైనా సరే కథను ఎంచుకునేటప్పుడు కాస్త ఆచితూచి అడుగులు వేయాలని, రెమ్యూనరేషన్ విషయంలో కూడా కాస్త తగ్గి ఉండాలని, ఇప్పటికే ఎంతోమంది అలా దిగివస్తున్నారు. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఇలా తన రెమ్యూనరేషన్ ను చిరంజీవి 157 మూవీ కోసం ఏకంగా సగానికి సగం తగ్గించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇక అందుకే మృణాల్ ఠాకూర్ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, తన రెమ్యూనరేషన్ను తగ్గించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ డెకాయిట్ సినిమా గనక కచ్చితంగా హిట్టు కొడితే, ఇక మళ్లీ ఈమె కెరియర్ పుంజుకుంటుంది. అందుకే ఈమె తెలుగు కెరియర్ ప్రస్తుతం డెకాయిట్ మీద ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
సక్సెస్ అయితే ఇక్కడే సెటిల్ అవుతుందా?
ఇక బాలీవుడ్ లో మాత్రం అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటుంది. ఇకపోతే అక్కడ సీనియర్ హీరోలతోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కాస్త డిసప్పాయింట్ లో ఉన్న ఈమెకు తెలుగులో మాత్రం ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా టాలీవుడ్ లోనే సెటిల్ అవుతుంది అనడంలో సందేహం లేదు. మరి డెకాయిట్ సినిమా మృణాల్ ఠాకూర్ కెరియర్ కు ఎలాంటి పునాదులు వేస్తుందో చూడాలి.
ALSO READ:Venu Swamy : విమాన ప్రమాదంపై ముందే హెచ్చరించిన వేణు స్వామి.. ఇండియాలో ఇలాంటి జ్యోతిష్యుడు ఉన్నాడా ?