BigTV English

Venu Swamy : విమాన ప్రమాదంపై ముందే హెచ్చరించిన వేణు స్వామి.. ఇండియాలో ఇలాంటి జ్యోతిష్యుడు ఉన్నాడా ?

Venu Swamy : విమాన ప్రమాదంపై ముందే హెచ్చరించిన వేణు స్వామి.. ఇండియాలో ఇలాంటి జ్యోతిష్యుడు ఉన్నాడా ?

Venu Swamy : వేణు స్వామి (Venu swamy).. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన.. 2020 నుండే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా కరోనా సమయం నుండీ సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా మారిపోయి అందరి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను బయటపెడుతూ వార్తల్లో నిలిచారు. తన మొదటి జ్యోతిష్యమే సమంత (Samantha ), నాగచైతన్య(Naga Chaitanya) పై చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అందులో భాగంగానే సమంత- నాగచైతన్య జాతకరీత్యా విడిపోతారని చెప్పి హాట్ బాంబు పేల్చిన వేణు స్వామి.. ఆయన చెప్పినట్టుగానే పెళ్లైన నాలుగేళ్లకే సమంత – నాగచైతన్య విడిపోవడంతో వేణు స్వామి మాటలు నిజమయ్యాయి. దీనికి తోడు వేణు స్వామి చెప్పిన కొన్ని మాటలు కూడా నిజం అవడంతో అందరూ వేణు స్వామి వెంటపడ్డారు. పైగా రష్మిక మొదలుకొని ఆషూ రెడ్డి వరకూ ఇలా చాలామంది హీరోయిన్లు ఈయనతో రాజ శ్యామల యాగం చేయించుకొని మరీ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


నిజమవుతున్న వేణు స్వామి జ్యోతిష్యం..

అయితే ఆ తర్వాత కాలంలో పలువురి పై వేణు స్వామి చేసిన కామెంట్లు బెడిసికొట్టాయి ముఖ్యంగా ప్రభాస్ సినిమా కెరియర్ పై, అలాగే రాజకీయ అంశాలపై కూడా స్పందించి కాస్త బోల్తాపడ్డారు. దీంతో వేణు స్వామి పై నెగిటివిటీ భారీగా పెరిగిపోయింది. ఇక ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో జగన్ మళ్ళీ గెలుస్తాడు అని, కూటమి నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారో.. ఇక అప్పటినుంచి ఆయన జ్యోతిష్యం చెప్పను అని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 2025 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మళ్లీ పంచాంగం చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఆ పంచాంగంలో వేణు స్వామి చెప్పిన మాటలను అందరూ తీసి పారేశారు. కానీ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ఒక్కొక్క సంఘటన జరుగుతుండడంతో ఇండియాలో ఇంతకంటే గొప్ప జ్యోతిష్యులు మరొకరు ఉన్నారా? అంటూ నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


భారీ విమాన ప్రమాదం.. 241 మంది మృతి.. మరో ఐదుగురు విద్యార్థులు కూడా..

అసలు విషయంలోకెళితే.. అనూహ్యంగా నిన్న జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాలను కలచివేసిన విషయం తెలిసిందే. దాదాపు 242 మంది ప్రయాణికులు ప్రయాణించే ఆ విమానం.. ఒక్కసారిగా బీజీ మెడికల్ కాలేజీ లోకి చొచ్చుకుపోయింది. గాల్లోకి ఎగరడం ఆరంభించిన విమానం 865 అడుగుల ఎత్తులోనే కుప్పకూలిపోయింది. పైగా ఆ విమానంలో 80 టన్నుల ఇంధనం ఉండడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పైగా ఈ విమానంలో ఉండే 241 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. సీటు నెంబర్ 11A సీట్ లో ఉన్న విశ్వాస్ రాగా మాత్రమే మృత్యుంజయుడిగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇక కాలేజీలోకి చొచ్చుకుపోవడంతో అక్కడ ఐదు మంది మెడికల్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్లంతా కూడా చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ ఘటనను ముందే ఊహించారు వేణుస్వామి.

ALSO READ:Manchu Vishnu : మనోజ్‌కు మంచు విష్ణు ఓపెన్ ఆఫర్… దగ్గరకి తీసుకుంటా అంటూ ట్వీట్

ఇండియాలో ఇంతకంటే గొప్ప జ్యోతిష్యుడు ఉంటారా?

అందులో భాగంగానే ఉగాది పంచాంగంలో వేణు స్వామి మాట్లాడుతూ.. “ఈ 2025 సంవత్సరం విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉందని” వేణు స్వామి తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే వేణు స్వామి చెప్పిందే నిజమైంది. దీన్ని బట్టి చూస్తే.. ఇంతకంటే గొప్ప జ్యోతిష్యులు మన ఇండియాలో మరొకరు ఉన్నారా అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం మరొకసారి నిజం అవడంతో అందరూ ఆయనపై ప్రపంచంలో కురిపిస్తున్నారు.

?utm_source=ig_web_copy_link

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×