Mrunal Takur : టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మొదటి సినిమాతోనే కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. తన అందం అభినయంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలో స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయ్యింది. గత ఏడాది వరకు వరుసగా సినిమాలను అనౌన్స్ చేసింది. మొన్నటివరకు బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ సడెన్ గా సినిమాలకు దూరం అవుతుందని ఓ వార్త వినిపిస్తుంది. ఇందులో నిజమేంత ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. అలా కాకుండా అంతా అయిపోయాక ఎంత చక్కబెట్టాలన్నా మొత్తం శూన్యంలానే కనిపిస్తుంది.. ఇప్పుడు హీరోయిన్ మృణాల్ పరిస్థితి అదే . మృణాల్ తన సినీ జీవితాన్ని ముందుగా మొదలుపెట్టింది మరాఠీ సినిమాలతో. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ పలు హిందీ సినిమాల్లో నటించింది. కానీ తన శ్రమకు తగ్గ ఫలితాన్ని మాత్రం మృణాల్ బాలీవుడ్ లో అందుకోలేక పోయింది.. ఇక అదే సమయంలో తెలుగులో సీతారామం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ ని అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ మృణాల్ మాత్రం సినిమాలను తగ్గించుకుంది.
సీతారామం లో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో నటించిన మృణాల్ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తన నటనతో అందరినీ మెప్పించి వావ్ అనిపించింది.. ఆ తర్వాత తెలుగులో ఇందుకు వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి అన్ని సినిమాలు అలాంటివే వచ్చాయి. ఇక మృణాల్ కు కోలీవుడ్ నుంచి శివ కార్తికేయన్ కు జంటగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఛాన్స్ వచ్చింది. కానీ కారణాలు ఏంటో తెలియదు ఆ సినిమాను రిజెక్ట్ చేసింది.. కోలీవుడ్లో ఛాన్స్ వదిలేసుకున్న సమయంలోనే విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. గ తేడాది ఆ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలో అడుగు పెట్టింది.. ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మృణాల్ కు కోలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చింది లేదు. గ్లామర్ విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టకపోయినా అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గాయనేది మాత్రం వాస్తవం.. ఇక చేతిలో సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమవ్వాలని ఆలోచనలో ఉందని ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని మంచి కథతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు సన్నిహిత వర్గాల్లో టాక్.. ఏది ఏమైనా కూడా ఈ విషయంపై మృణాల్ ఠాకూర్ స్పందించాల్సి ఉంది.. ఇక మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలుసు లేటెస్ట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది