Mrunal Thakur: సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువగా ఉంది అని ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు తమ బాధను వెల్లబుచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కష్టపడి పైకి వచ్చిన తాము నెపో కిడ్స్ ముందు తేలిపోతున్నాము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నాచురల్ స్టార్ నాని (Nani )ని మొదలుకొని చాలామంది హీరోలు అలాగే హీరోయిన్లు కూడా ఇదే విషయంపై మాట్లాడిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఊహించని కామెంట్స్ చేశారు ప్రముఖ యంగ్ బ్యూటీ మృనాల్ ఠాగూర్(Mrunal Thakur). తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొని తనకు ఎదురైనా అనుభవాన్ని పంచుకోవడమే కాకుండా స్టార్ కిడ్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)పై మండిపడింది మృనాల్ ఠాకూర్.
నెపోటిజంపై మృనాల్ ఠాగూర్ షాకింగ్ కామెంట్స్..
మృనాల్ టాగూర్ మాట్లాడుతూ ..” వారసత్వానికి ఉన్న ప్రాధాన్యత కష్టపడి పైకి వచ్చిన మాలాంటి వాళ్లకు లేకుండా పోయింది. నేను ఒక అవార్డు ఫంక్షన్ కి హాజరయ్యాను. అప్పుడు మీడియా నా చుట్టూ చేరి అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చాను. ఇంతలోనే శ్రీదేవి (Sridevi ) కూతురు జాన్వీ కపూర్ రావడంతో వెంటనే నా దగ్గర ఉన్న మీడియా ప్రతినిధులు మొత్తం ఆమె వద్దకు పరుగులు తీయడం నన్ను ఎంతో బాధించింది” అంటూ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఎమోషనల్ అయింది మృనాల్ ఠాగూర్. ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ నెపోటిజం ఇండస్ట్రీలో ఎప్పుడు పోతుందో అంటూ నిట్టూరుస్తున్నారు మృనాల్ అభిమానులు.