Crime News: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ గేమ్స్ లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. 21 మంది అథ్లెట్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. డ్రైవర్ ఓవర్ స్పీడ్, అలసటతో బస్సును డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ALSO READ: Telangana Movement: తెలంగాణ ఉద్యమంలో రియల్ హీరోలు వీళ్లే..!
అథ్లెట్లు అందరూ.. ఓగన్ లో జరిగిన 22వ జాతీయ క్రీడలలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నైజీరియాలో రోడ్ల వ్యవస్థ సరిగా లేకపోవడం.. ట్రాఫిక్ ఉల్లంఘనలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ALSO READ: Court Jobs: కోర్టులో 1620 ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? రేపే లాస్ట్ డేట్ మిత్రమా?