BigTV English

Chiranjeevi: కమెడియన్ అలీకి ‘చిరు’ సర్ప్రైజ్.. ఇలా కూడా ప్రమోషన్స్ చేస్తారా?

Chiranjeevi: కమెడియన్ అలీకి ‘చిరు’ సర్ప్రైజ్.. ఇలా కూడా ప్రమోషన్స్ చేస్తారా?

Chiranjeevi:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చాలా సందర్భాలలో ఒకరిపై ఒకరు ఆ అనుబంధాన్ని చూపించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా తన తోటి నటులపై అప్పుడప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటూ.. వారితో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇక అలాంటి వారిలో అలీ (Ali) కూడా ఒకరు. చిరంజీవికి అత్యంత సన్నిహితులలో ఒకరిగా నిలిచిన వారిలో అలీ, బ్రహ్మానందం(Brahmanandam) పేర్లు ప్రధమంగా వినిపిస్తాయి. ముఖ్యంగా వీరు ముగ్గురు కలిసి ఎన్నో సినిమాలలో నటించారు కూడా.. ఇకపోతే ఈ మధ్యకాలంలో పెద్దగా కలిసి ఒకే స్టేజ్ పై కనిపించలేదు కానీ ఒకప్పుడు చాలాసార్లు తమ అనుబంధాన్ని చూపించుకున్నారు కూడా.


అలీకి చిరంజీవి స్పెషల్ సర్ప్రైజ్..

ఇకపోతే తాజాగా చిరంజీవి అలీకి, బ్రహ్మానందం కి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. చిరంజీవి ప్రతి ఏడాది తమ తోటలో పండే మామిడి పండ్లను అటు బ్రహ్మానందం ఇటు అలీకి పంపిస్తూ ఉంటారు. ఈసారి కూడా తన తోటలో పండిన మామిడిపళ్ళను ఆయన స్పెషల్ గా ప్యాక్ చేసి మరీ పంపించారు. అయితే ఈ సారి మామిడి పళ్ళు మాత్రమే కాకుండా అందులో చిరంజీవి భార్య సురేఖ (Surekha )వంటకాలను కూడా పంపించడం గమనార్హం . ముఖ్యంగా సురేఖ వంటకాలను అందరికీ రుచి చూపించాలనే ఉద్దేశంతోనే ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ అనే ఒక ఫుడ్ బిజినెస్ ని కూడా మొదలు పెట్టింది. అందులో ఇన్స్టెంట్ రెడీ టు మిక్స్ పొడులు దొరుకుతాయి. అందులో భాగంగానే ఆవకాయతో పాటు ఉప్మా, రసం, పొంగల్, కేసర్ ఇలా పలురకాల పొడులను పంపించారట. వీటితో అప్పటికప్పుడు వంటలు చేసుకోవచ్చు. ఈ గిఫ్ట్ వీడియోని అలీ భార్య జుబేదా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు జుబేదా ఈ విషయాన్ని అందరితో చెబుతూ చిరంజీవి తమ మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ పంపించారని చెబుతూ మురిసిపోయింది. ఇకపోతే ఇది చూసిన కొంతమంది చిరంజీవి, అలీ మధ్య ఉన్న అనుబంధానికి మోహితులవుతుంటే.. మరికొంతమంది అత్తమ్మాస్ కిచెన్ పొడులను ఇలా కూడా ప్రమోషన్ చేస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే చిరంజీవి సర్ప్రైజ్ గిఫ్ట్ బాగానే ఉన్నా కొంతమంది వీటిపై విమర్శలు గుప్పిస్తున్నారని తెలుస్తోంది.


also read : Kannappa Movie Story: కన్నప్ప స్టోరీ ఇదేనా.. ఇందులో కొత్తేమి ఉంది శివయ్యా!

చిరంజీవి సినిమాలు..

మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ మొదలు పెట్టేసారు. ఇందులో నయనతార(Nayanthara )హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీ తో మళ్లీ చిరంజీవి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ లకు అవకాశాన్ని కల్పిస్తూ బిజీగా మారిపోతున్నారు చిరంజీవి.

?utm_source=ig_embed&utm_campaign=loading

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×