BigTV English

Mukesh Khanna: షారుఖ్ ఖాన్.. అందులో నటించొద్దు: శక్తిమాన్ హీరో ముఖేష్ ఖన్నా

Mukesh Khanna: షారుఖ్ ఖాన్.. అందులో నటించొద్దు: శక్తిమాన్ హీరో ముఖేష్ ఖన్నా

Mukesh Khanna REACTS to Shah Rukh Khan: పాన్ మసాలా, గుట్కా తదితర పదార్థాలు ఎంతోమంది ప్రాణాలను తీస్తున్నాయి. అయితే ప్రాణాలకు ప్రమాదమయ్యే ఇలాంటి పదార్థాలకు సంబంధించిన ఉత్పత్తుల యాడ్స్‌లో ప్రముఖ హీరోలు నటించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎక్కువగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో నటించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి పాన్ మసాలా వంటి బ్రాండ్‌లపై యాడ్స్‌లో నటించే హీరోలపై ఇటీవల కొంతమంది విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తాజాగా, టెలివిజన్ శక్తిమాన్ నటుడు ముఖేశ్ ఖన్నా పలు వ్యాఖ్యలు చేశాడు.


బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్ తదితరులు పలు పాన్ మసాలా యాడ్స్‌లలో నటిస్తున్నారు. వీరంతా ఇలాంటి యాడ్స్‌లో యాక్ట్ చేయద్దని, ఇప్పటినుంచి మానేయాలని ముఖేల్ కన్నా కోరారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే అక్షయ్ కుమార్ వంటి వారు కూడా భయంకరమపై పాన్ మసాలా వంటి యాడ్స్‌లో నటించడం బాధాకరమన్నారు. ఆయనను కలిసి మాట్లాడానని చెప్పుకొచ్చారు.

అయితే, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సైతం పాన్ యాడ్స్ బాటలోకి వెళ్లడం సరికాదన్నారు. ఈ యాడ్స్ చేసేందుకు కొన్ని కోట్లు ఖర్చవుతుంది. ఇంత ఖర్చు చేసేందుకు ఎందుకోసమని ప్రశ్నించారు. భారీగా ఖర్చు చేసి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో తెలుసా? అన్నారు. ఇందులో వక్కపొడి మాత్రమే ఉందని అమ్ముతున్నా.. పాన్ మసాలా కాదని అంటుంటారు. కానీ వాస్తవమేంటో వాళ్లకు కూడా తెలుసన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండే ఏ వస్తువైన ప్రమోషన్స్, యాడ్స్ చేయకూడదని సలహా ఇచ్చారు.


Also Read: అపహాస్యం చేయకండి.. థియేటర్ లో పెళ్లి పై స్పందించిన కృష్ణవంశీ

అంతకుముందు, పాన్ మసాలా యాడ్ లపై జాన్ అబ్రహం ఆగ్రహం వ్యక్తం చేశాడు. పొగాకు బ్రాండ్ ను ప్రచారం చేయడం తాను ముగించానని చెప్పారు. నకిలీ మనిషిలా బతకడం ఇష్టం లేదని, ప్రజలకు ఏది మంచి ఏది చెడో చెప్పే స్థాయి మాకు ఉందన్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆరోగ్యం విషయంలో కొంతమంది స్టార్స్ పాన్ మసాలా వంటి యాడ్స్ లలో కనిపిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి కంపెనీలతో సంబంధం లేకుండా యాడ్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×