BigTV English

Murari Re-Release: అపహాస్యం చేయకండి.. థియేటర్ లో పెళ్లి పై స్పందించిన కృష్ణవంశీ

Murari Re-Release: అపహాస్యం చేయకండి.. థియేటర్ లో పెళ్లి పై స్పందించిన కృష్ణవంశీ

Marriages in Murari Re- Release Theatres: టాలీవుడ్ ఇప్పుడేదైనా ట్రెండ్ నడుస్తుందా అంటే.. అదే రీ రిలీజ్ లు. 10, 20 ఏళ్ల క్రితం వచ్చిన హీరోల సినిమాలను వాళ్ల బర్త్ డే లకు, ఇతర అకేషన్లకు రీ రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ రిలీజైనప్పుడు హిట్ కాని సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయి.. మంచి వసూళ్లు రాబడుతున్నాయి. అందుకు ఉదాహరణ ఓయ్ సినిమానే. ఈ సినిమా రీ రిలీజ్ కు వచ్చిన క్రేజ్ ఎంతటిదో మనందరికీ తెలిసిందే.


ఇక తాజాగా ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేశ్ బర్త్ డే సందర్భంగా మురారి సినిమా రీ రిలీజ్ చేశారు. రెండ్రోజులుగా ఈ సినిమా స్పెషల్ షో లకు మంచి స్పందన వచ్చింది. 2001లో రిలీజైన ఈ సినిమా అప్పట్లోనే 100 రోజులు థియేటర్లలో ఆడింది. 23 ఏళ్ల తర్వాత డాల్బీ 4kవెర్షన్ లో రీ రిలీజ్ చేయగా.. అభిమానులు సందడి చేశారు. మరీ ముఖ్యంగా సినిమాలోని పాటలకు విశేష స్పందన లభించింది.

అయితే సినిమాలో అలనాటి రామచంద్రుడు అంటూ వచ్చే పెళ్లి పాటకు యువత అట్రాక్ట్ అయ్యారు. అంతవరకూ ఫర్వాలేదు. కానీ థియేటర్లలో ఆ పాట వచ్చే సమయంలోనే పెళ్ళిళ్లు కూడా చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయవాడ అలంకార్ థియేటర్లో ఓ జంట పాట ప్లే అవుతున్న సమయంలో పెళ్లి చేసుకున్న వీడియో బాగా వైరల్ అయింది.


Also Read: మహేష్ ఫ్యాన్స్ దెబ్బ.. మురారి హీరోయిన్ అబ్బా.. చెప్పేసిందిగా

అయితే కొందరు నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేసి.. కొత్తజంటను ఆశీర్వదించాలని కోరారు. దానిపై స్పందించిన మురారి సినిమా దర్శకుడు కృష్ణవంశీ.. ఇది మంచి పద్ధతి కాదని బదులిచ్చారు. మన సంస్కృతి, సాంప్రదాయాలని ఇలా అపహాస్యం చేయకండి అని సూచించారు. మరికొందరు కూడా థియేటర్లలో ఇలా పెళ్లిళ్లు చేసుకోవడం ఏం బాలేదని, వాళ్ల పేరెంట్స్ ఎంత బాధపడతారో ఆలోచించలేదని ఫైరయ్యారు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న జంటకు ఆల్రెడీ పెళ్లైందని, మహేశ్ పై ఉన్న అభిమానంతో ఆ పాటలో పెళ్లి చేసుకున్నట్లుగా రీ క్రియేట్ చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఏదేమైనా.. మురారి రీ రిలీజ్ కు సుమారుగా రూ.5 కోట్లు కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. రీ రిలీజ్ సినిమాను ఇంతలా ఆదరించినందుకు.. మురారిని ప్రేమించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Related News

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Big Stories

×