BigTV English

HIT 3 Movie Review : హిట్ 3 మూవీ రివ్యూ : ఇట్స్ అర్జున్ సర్కార్ షో

HIT 3 Movie Review : హిట్ 3 మూవీ రివ్యూ : ఇట్స్ అర్జున్ సర్కార్ షో

HIT 3 Movie Review : నాని – శైలేష్ కొలను కలయికలో రూపొందిన యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 3’. భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…


కథ :
నాని (అర్జున్ సర్కార్) జైలు పాలు అవుతాడు. అక్కడ అతన్ని కొంతమంది రౌడీలు చంపాలి అనుకుంటారు. వాళ్ళు ఎందుకు చంపాలి అనుకుంటున్నారు ? అనే పాయింట్ దగ్గర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది. ఇద్దరు క్రిమినల్స్ ను అర్జున్ సర్కార్ తలక్రిందులుగా వేలాడదీసి వాళ్ళని క్రూరంగా హతమారుస్తాడు. దానిని మళ్ళీ వీడియోలుగా కూడా తీస్తాడు? ఇతను ఎందుకు హత్యలు చేస్తాడు? అనుకున్న టైంలో మృదుల అనే అమ్మాయి ఇతని లైఫ్లోకి ఎంట్రీ ఇస్తుంది.

తక్కువ టైంలోనే మృదులతో ప్రేమలో పడతాడు అర్జున్ సర్కార్. కశ్మీర్లో సీరియల్ కిల్లింగ్స్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అర్జున్ సర్కార్.. వైజాగ్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. అసలు సీరియల్ కిల్లింగ్స్ చేస్తుంది ఎవరు? వాళ్ళ వల్ల అర్జున్ సర్కార్ జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? మృదుల ఎవరు? అసలు అర్జున్ జైలుకు ఎందుకు వెళ్ళాడు? మర్డర్లు ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగిలిన సినిమా.


విశ్లేషణ :
శైలేష్ కొలను ‘హిట్’ యూనివర్స్ లో భాగంగా వచ్చిన 3 వ సినిమా ఇది. చిన్న పిల్లలు, మృదు స్వభావులు ఈ సినిమాకి రావద్దని నాని ప్రమోషన్స్ లో భాగంగా చెబుతూ వచ్చాడు. సో చాలా మంది ప్రిపేర్ అయ్యే ఈ సినిమాకి వెళ్తారు. వెళ్ళాలి కూడా..! ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే కశ్మీర్ ఎపిసోడ్ వచ్చిందో.. అక్కడి నుండి స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది.

ఇటీవల కశ్మీర్ పహల్గామ ఉగ్రవాది దాడి జరిగిన ప్లేస్లో ఈ సినిమా షూటింగ్ కొంత భాగం జరిగింది. అది బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు. లొకేషన్స్ బాగున్నా.. అక్కడ ఉన్న జనాలు అంతా క్రూరంగా కనిపిస్తారు. సినిమాలో శైలేష్ వాళ్ళని బాగా చూపించాడు అనే చెప్పుకోవాలి. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది.

సెకండాఫ్ పై హోప్ ఏర్పడేలా చేస్తుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే ఇంటరాగేషన్ ఎపిసోడ్ కొంచెం డ్రాగ్ అనిపించినా.. సైకోల గేదరింగ్ ఎపిసోడ్ నుండి ఒక తెలీని అటెన్షన్ వస్తుంది. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, వయొలెన్స్ తో కూడుకున్న సన్నివేశాలు టార్గెటెడ్ ఆడియన్స్ కి నచ్చుతాయి. చిత్ర బృందం ప్రమోషన్స్ లో చెప్పినంత ఘోరమైన వయొలెన్స్ అయితే ఈ సినిమాలో లేదు అనే చెప్పాలి.

ఇటీవల వచ్చిన ‘కిల్’ ‘మార్కో’ అనే సినిమా పక్కన పెట్టి చూస్తే ఇది ‘శంకరాభరణం’ అనిపించొచ్చు కూడా..! ప్రీ క్లైమాక్స్ పోర్షన్ మళ్ళీ బాగా డిజైన్ చేశారు. అక్కడ వచ్చే సర్ప్రైజులు బాగుంటాయి. సినిమా మొత్తంలో టెక్నికల్ టీం పనితీరు హైలెట్ అయ్యింది అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ నుండి యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ రిచ్ గా అనిపిస్తాయి. శైలేష్ కొలను మార్క్ ఎలిమెంట్స్ ఉన్నా.. ఎక్కువ శాతం హీరో నానినే డైరెక్ట్ చేసాడేమో అనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

నటీనటుల విషయానికి వస్తే.. నాని యారొగెంట్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. శ్రద్దా శ్రీనాథ్ కి కూడా మంచి రోల్ పడింది. రావు రమేష్, సముద్ర ఖని ల పాత్రలు అంతంత మాత్రమే. శ్రీనాథ్ మాగంటికి అడివి శేష్ తో సమానమైన రోల్ దక్కింది అనుకోవాలి. ఆ సైకో బ్యాచ్ ను ఎక్కడ పెట్టారో కానీ వాళ్ళు చూడటానికి నిజంగానే సైకోలుగా అనిపిస్తారు.

ప్లస్ పాయింట్స్ :

నాని
ఇంటర్వెల్ బ్లాక్
ప్రీ క్లైమాక్స్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా సాగదీత
పాటలు

మొత్తంగా… ‘హిట్ 3’ టార్గెటెడ్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే మిగతా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదానిపై బాక్సాఫీస్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

HIT 3 Telugu Movie Rating : 2.5/5

Related News

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Kingdom Movie Review : కింగ్డమ్ మూవీ రివ్యూ : ప్రయోగం సక్సెసా ?

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

Kingdom Review: కింగ్డమ్ ఫస్ట్ రివ్యూ.. ఆశ్చర్యపరుస్తున్న ఉమైర్ సంధు ట్వీట్!

Mandala Murders series review : ‘మండల మర్డర్స్’ సిరీస్ రివ్యూ… కన్ఫ్యూజింగ్ మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×