BigTV English

RGV: వర్మకు బిగ్ షాక్.. ఆ కేసుతో జైలు శిక్ష పడునుందా..?

RGV: వర్మకు బిగ్ షాక్.. ఆ కేసుతో జైలు శిక్ష పడునుందా..?

RGV: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) కు తాజాగా బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంతేరీ మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. రాంగోపాల్ వర్మను ఈ కేసులో దోషిగా తేలుస్తూ.. మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా విధించింది. గత ఐదు సంవత్సరాలుగా చెక్ బౌన్స్ విచారణ జరుగుతూ ఉండగా.. వర్మ మాత్రం కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆగ్రహించిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి వర్మ రూ.3.27 లక్షల పరిహారం చెల్లించాలని, లేకపోతే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా మేజిస్ట్రేట్ తీర్పును వెల్లడించింది.అసలు విషయంలోకి వెళ్తే.. 2018లో మహేష్ చంద్ర మిశ్రా (Mahesh mishra chandra ) అనే ఒక వ్యక్తి ‘శ్రీ’ అనే కంపెనీ పేరు మీద రాంగోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరి కోర్టు ఇచ్చిన తీర్పుకు రాంగోపాల్ వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


రామ్ గోపాల్ వర్మ కెరియర్..

ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ముఖ్యంగా తన చిత్రాలతో యువతకు ఏదో తెలియని అనుభూతిని అందించేవారు. మాస్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు మాఫియా, హారర్ నేపథ్యంలో కూడా చిత్రాలు తీయడంలో సిద్ధహస్తుడు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా.. ప్రస్తుతం హిందీలో స్థిరపడిపోయాడు. ఆయనకు పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యంగా శివ, క్షణక్షణం, రంగీలా, సత్య, కంపెనీ, భూత్ వంటి చిత్రాలు మంచి గుర్తింపును అందించాయి. వర్మ డైరెక్టర్ గానే కాకుండా వర్మ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలు నిర్మిస్తున్నారు.


వర్మ సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన వర్మ.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అలాంటి చిత్రాలు చేసి విమర్శలకు చోటు ఇచ్చారు. గత కొంతకాలంగా మళ్లీ తనను తాను చూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే ఆయనను నమ్ముకున్న ఎంతోమంది పాత వర్మ కావాలని కోరగా.. ఇప్పుడు మారాను అని, ఖచ్చితంగా మీకు మునుపటిలాంటి చిత్రాలను అందిస్తానని తెలిపారు వర్మ. దీనికి తోడు మొన్న సత్య రీ రిలీజ్ చేయగా. సినిమా చూసిన తర్వాత మొదటిసారి ఏడ్చాను అని, అప్పుడే తాను చేస్తున్న తప్పేంటో తెలిసింది అంటూ కూడా వర్మ తెలియజేశారు. దీనికి తోడు ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా వర్మా నుంచి ఎవరు ఊహించని సినిమాలు రావాలని కోరాడు.. మరి అందరి కోరికల మేరకు వర్మ తనను తాను మార్చుకొని మళ్లీ కం బ్యాక్ అవుతారేమో చూడాలి. ప్రస్తుతం వర్మకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అంతేకాదు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి వెంకటేష్ (Venkatesh ), అమితాబ్ బచ్చన్(Amitabh bachchan)తో కలిసి మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారట రాంగోపాల్ వర్మ.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×