BigTV English

Tollywood IT Raids : ఆఫీస్‌లో చెంప దెబ్బలు బాబా…? ఫోన్ ఇవ్వకపోవడంతో అధికారులు సీరియస్

Tollywood IT Raids : ఆఫీస్‌లో చెంప దెబ్బలు బాబా…? ఫోన్ ఇవ్వకపోవడంతో అధికారులు సీరియస్

Tollywood IT Raids : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐటి అధికారులు బడా నిర్మాతలను టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఊహించని రైడ్ అటు టాలీవుడ్ నిర్మాతలనే కాదు.. ఇటు సినీ సెలబ్రిటీలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. దీంతో టాలీవుడ్ మొత్తం అప్రమత్తం అయిందని సమాచారం. గత రెండు రోజులుగా దాదాపు 200 మంది ఐటి అధికారులు టాలీవుడ్ బడా నిర్మాతల ఇళ్లల్లో, ఆఫీసుల్లో, బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మూడవ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.


3వ రోజు కొనసాగుతున్న ఐటీ రైడ్స్..

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డి ఇల్లు ఆఫీసులతోపాటు.. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, అభిషేక్ అగర్వాల్ వంటి బడా నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో కూడా మూడో రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. మరొకవైపు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 కలెక్షన్స్ అధికారిక లెక్కలు, కట్టిన టాక్స్ పై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాల కలెక్షన్లు, వాటి బడ్జెట్, వాటికి సంబంధించిన ఫైనాన్స్ వివరాల గురించి ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది.


సిబ్బందిపై చేయి చేసుకున్న అధికారులు..

ఇదిలా ఉండగా మరొకవైపు.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సోదాలు నిర్వహిస్తున్న ఒక సిని నిర్మాణ సంస్థ ఆఫీస్‌లో ఐటి అధికారులు సినిమా సిబ్బంది మొబైల్ ఫోన్ అడిగారట. అయితే ఆయన తన దగ్గర ఉన్న రెండు మొబైల్స్ లో ఓ డమ్మీ ఫోన్ మాత్రమే అధికారులకు ఇచ్చారట. ఆ తర్వాత గమనించిన అధికారులు రెండవ ఫోన్ కూడా ఇవ్వాలని చాలా మర్యాదగా కోరారట. కానీ ఆయన తన ఫోన్ ఇవ్వడానికి నిరాకరించడంతో సీరియస్ అయిన అధికారులు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ.. ఆయన చెంప చెల్లుమనిపించినట్లు సమాచారం. అంతే కాదు… ఫోన్ ఇవ్వకుండా.. ఐటీ అధికారులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన కారణంగా… ఆయనకు నిన్న (బుధవారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓ శిక్ష కూడా వేసినట్టు తెలుస్తుంది.

ఈ విషయం కాస్త బయటకు రావడంతో ఏంటి బాబా ఇది ఫోన్ అడిగినప్పుడు ఇచ్చేయ్యాలి కదా అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఐటీ అధికారులు ప్రశ్నించిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ విరుద్ధంగా ప్రవర్తించడం వల్లే ఇలా అధికారులు చేయి చేసుకుని ఉండి ఉంటారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

కలెక్షన్స్ పోస్టర్స్ వల్లే అసలు చిక్కు..

ఈ సంక్రాంతి సందర్భంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్(Game changer ), బాలకృష్ణ డాకుమహారాజ్ (Daaku Maharaj), వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు కంటెంట్ పరంగా ఎలా ఉన్నా సరే.. కలెక్షన్లు మాత్రం వందల కోట్లు వస్తున్నాయని మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ఐటీ అధికారులు పెట్టిన బడ్జెట్ ఎంత? వాటికి వచ్చిన కలెక్షన్ ఏంటి? టాక్స్ లు ఏ విధంగా పే చేస్తున్నారు? ఇలా అన్ని విషయాలపై ఆరా తీయడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా కలెక్షన్స్ రాకపోయినా.. గొప్పలకు పోయి తప్పుడు పోస్టర్స్ వేయడం వల్లే.. ఇప్పుడు ఐటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×