Protest Against Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కారు. సేవ్ కాంగ్రెస్- సేవ్ పటాన్ చెరు అనే స్లోగన్‌తో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చిన మహిపాల్ రెడ్డి, తన అనుచరులు తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
Also Read: Uttam Kumar Reddy Meeting: గ్రామసభల్లో సమస్యలపై చెక్, మంత్రి భేటీలో కీలక నిర్ణయాలు
గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, తన అనుచరులు బూతులు తిడుతున్నారని బొల్లారం కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరులతో తమకు ఎలాంటి గొడవలు లేకుండా చూడాలని చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై పటాన్ చెరు కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డికి, పీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి 2024 జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన పార్టీలో చేరడం పటాన్ చెరు స్థానిక కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు. ఆ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు రూట్ క్లియర్ చేసి గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఆయన పార్టీలో చేరిన నుంచి తరుచూ ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడికి దిగుతున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.