Pravasthi Sunitha issue : సింగర్ ప్రవస్తి (Singer Pravasthi).. చిన్న వయసు నుంచే పాటలు పాడడం మొదలుపెట్టిన ఈమె.. అప్పటి నుంచే ఎంతో మంది శ్రోతలను తన గాత్రంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubramanyam) లాంటి దిగ్గజ గాయకుల మన్ననలు పొందిన ఈమె, ఇప్పుడు ఆయన స్థాపించిన పాడుతా తీయగా కార్యక్రమం పై విమర్శలు గుప్పించడం సంచలనంగా మారింది. ఒకప్పుడు ఇదే షోలో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ప్రవస్తిని ఇప్పుడు జడ్జెస్ ఎలిమినేట్ చేయడం పై అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తనపై పక్షపాతం చూపించారని.. నచ్చిన వారికే ఇక్కడ అవకాశాలు ఉంటాయని.. ముఖ్యంగా సింగర్ సునీత తన విషయంలో పూర్తిగా పక్షపాతం చూపించింది అని.. ఆమె ఒక ఫేక్ అని ఆవేదన వ్యక్తం చేసింది సింగర్ ప్రవస్తి. ఇక షోలో బొడ్డు కిందకు చీర కట్టుకొని ఎక్స్పోజ్ చేయాలని ప్రొడక్షన్ టీం తనను బలవంతం చేసింది అని కూడా ప్రవస్తి తెలిపింది.
గ్రూప్ ఇజం పోవాలి – మ్యూజిక్ డైరెక్టర్ షకీల్..
ఇక సింగర్ ప్రవస్తి మాటలపై ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సింగర్ లిప్సిక మొదలుకొని మరికొంతమంది ఇలా ముందుకొచ్చి షోలో అలాంటివేవీ లేవు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది జడ్జెస్ కి మద్దతు పలుకుతుంటే మరికొంతమంది సింగర్ ప్రవస్తి ఆవేదనను అర్థం చేసుకొని ఆమెకు అండగా నిలుస్తున్నార. ఈ క్రమంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ (Shakeel) కూడా తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ” మార్కెట్లో గ్రూప్ యిజం ఉంది. ముందు ఇది పోవాలి. ముఖ్యంగా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎవరు సక్సెస్ అయితే వాళ్ల దగ్గరకు అసిస్టెంట్లుగా కొంతమంది వెళ్తారు.ఆ అసిస్టెంట్ ఏం చేస్తారు.. ఎవరినైనా పిలవమంటే వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళని మాత్రమే పిలుస్తారు. ఇక బయట వాళ్లకి అవకాశం ఎక్కడుంది. కంపోజర్స్ కూడా ఈ విషయం తెలుసుకొని కొత్తవారికి అవకాశం కల్పించాలి. ముఖ్యంగా కుల గజ్జి, గ్రూప్ ఇజం అనేది పోతే అటు సింగర్స్ అంతా కూడా తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం కలుగుతుంది.
కులగజ్జి వల్లే ఇండస్ట్రీలో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదు – షకీల్
ముఖ్యంగా వాయిస్ క్వాలిటీ సౌండ్ ఎలా ఉంది అని మాత్రమే చూసుకోవాలి. కులగజ్జి, గ్రూప్ ఇజం లాంటివి తీసేస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ప్రత్యేకించి ఈ జనరేషన్లో కూడా కులాల గురించి ఆలోచించే మైండ్ సెట్ ఉన్నవారు మా గ్రూపులో కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్లే టాలెంట్ తొక్కి వేయబడుతోంది.అయితే అందర్నీ అలా అని చెప్పలేము.కొంతమంది మాత్రమే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక ప్రవస్తీ విషయానికి వస్తే.. ఆమె చెప్పిందాంట్లో 100 కి 100% నిజం కాకపోయినా కనీసం 70% నిజం ఉండొచ్చేమో.. కానీ కీరవాణి గారు ఇలా చేశారన్నది ఎవరు నమ్మశక్యం కాదు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వరు. గుంటూరు, వైజాగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రాలో చాలా ప్రాంతాలలో చాలా అద్భుతంగా పాడేవారున్నారు. వారందరూ వెలుగులోకి రావాలి. కానీ వారికి అవకాశాలే ఇవ్వట్లేదు కదా.. ముఖ్యంగా ప్రవస్తి చెప్పిన దాంట్లో కూడా నిజముందేమో” అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.