MI vs SRH – Terror Attack : జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లోని బైసరన్ లో మంగళవారం హృదయ విదారక ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి తరువాత దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటివరకు 28 మంది మరణించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇవాళ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. జమ్మూ కాశ్మీర్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ చీర్ లీడర్స్ లేకుండానే మ్యాచ్ జరుగనుంది. అలాగే గెలిచిన తరువాత సెలబ్రేషన్స్ ఉండవని.. నల్ల బ్యాడ్జీలు ధరించాలని తాజాగా BCCI నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటిస్తారని ప్రకటించింది BCCI. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటిస్తారని తెలిపింది. ఇవాళ్టి IPL మ్యాచ్‌లో ఆటగాళ్లు, అంపైర్లు నలుపు రిబ్బన్లను ధరించి ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తారు.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో సొంత గడ్డ పై సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ముంబై మాజీ సారథి రోహిత్ శర్మతో లోకల్ క్రికెటర్ తిలక్ వర్మ బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తితో వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ముంబైకి ఓపెనింగ్ ఇచ్చే బాధ్యత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వికెట్ కీపర్ కం బ్యాట్స్ మన్ రియాన్ రికెల్టన్ పై ఉంటుంది. గత మ్యాచ్ లో ఎల్లో ఆర్మీ పై వీరిద్దరూ 40 బంతుల్లో 63 పరుగులు బలమైన ప్రారంభాన్ని అందించారు. దీంతో ముంబై జట్టు 177 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలిగింది. అదే సమయంలో ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ఇద్దరూ ఓపెనర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఇలాంటి బలమైన ఓపెనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చిన తరువాత ముంబై టాప్ ఆర్డర్ మునుపటి కంటే ప్రమాదకరంగా కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ దూకుడు విధానం ఈ జట్టును మనుపటి కంటే డేంజరస్ గా మార్చింది.
అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ రెండింటిలో కూడా ముంబై జట్టు బలంగానే కనిపిస్తోంది. మరోవైపు గత సీజన్ రన్నరప్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ 2025లో విజయం కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడిన జట్టు 5 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ యువ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీని బయటికి పంపించనున్నట్టు సమాచారం. ముంబై తో జరిగే మ్యాచ్ లో జీషన్ అన్సారీ స్థానంలో రాహుల్ చాహర్ కి అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది.
ముంబై ఇండియన్స్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరిన ఇషాన్ కిషన్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. కానీ ఆ తరువాత 6 మ్యాచ్ లలో ఒక్కసారి కూడా రెండు అంకెల స్కోర్ ను సాధించకపోవడం గమనార్హం. ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో ఇషాన్ భారీ ఇన్నింగ్స్ కూడా ఆడకపోతే మాత్రం అతని స్థానంలో వేరే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. వాస్తవానికి ఈ సీజన్ లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో అద్భుతంగా ఆడినప్పుడల్లా హైదరాబాద్ విజయం సాధించింది. పవర్ ప్లే లో 65 కంటే తక్కువ పరుగులు చేసినట్టయితే హైదరాబాద్ ఓడిపోతుంది. ఇవాళ పవర్ ప్లే లే హైదరాబాద్ ఎలా ఆడుతుందో వేచి చూడాలి మరీ.
🚨 NO FIREWORKS CELEBRATIONS TONIGHT 🚨
– MI & SRH players will be wearing black armbands today.
– No fireworks & No cheerleaders tonight.
– A one minute silence will be observed. (Vipul Kashyap/ANI). pic.twitter.com/fXTnu4v5IG
— Tanuj (@ImTanujSingh) April 23, 2025