Thaman on Shankar : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. కిక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యాడు తమన్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఈ పాటలు అందరిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒకసారి కొత్త సంగీత దర్శకుడు దొరికాడు అని చాలామంది అనుకున్నారు. అయితే తమన్ ను చూసిన వెంటనే చాలామంది దర్శకులకు అప్పటికే తమన్ పరిచయం ఉంది. దీని కారణం మణిశర్మ దగ్గర కొన్నేళ్లపాటు తమన్ పనిచేయడమే. తమన్ కేవలం సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలో శంకర్ కెరియర్ లో ఉన్నాయి. శంకర్ సినిమా అంటే 100% ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఉంటుంది. ఒక సందర్భంలో వీరిద్దరికీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చి కలిసి పనిచేయలేకపోయారు. అప్పుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాకి హరీష్ జైరాజ్ సంగీతం అందించారు. ఆ పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఆ తర్వాత రజనీకాంత్ ద్వారా వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేశారు. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ తోనే కంటిన్యూ అయ్యారు శంకర్. హరీష్ జయరాజ్ తర్వాత మరో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కలిసి పనిచేస్తున్నాడు శంకర్. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి తమన్ అందించిన సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. ప్రతి పాట దేనికి అదే ప్రత్యేకంగా ఉంది అని చెప్పాలి.
ఒక గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ తమన్ ఆ జర్నీ అంతటినీ తెలిపాడు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకి సంగీతం అందిస్తున్న టైంలో మగువా మగువా పాటను దిల్ రాజుకు వినిపించారట తమన్. పాట బాగుంది అని చెప్పిన తర్వాత దిల్ రాజు నవ్వుతూనే ఉన్నారు. ఆ తర్వాత కాసేపటికి నువ్వు వెళ్లి దర్శకుడు శంకర్ గారిని కలవాలి అని చెప్పారట. ఈ మాటలు విన్న తమన్ ఫ్లైట్ గాల్లో తేలకముందే నేను గాలిలో తేలిపోయాను అంటూ చెప్పుకొచ్చారు. నాకు యాక్టింగ్ రాదు అని తెలుసునా కూడా శంకర్ గారు నన్ను బాయ్స్ సినిమాలో పెట్టారు. నేను బాగా నటించకపోతే నన్ను మైక్ లో తిడుతూ ఉండేవాళ్ళు. అలానే నేను ఆయన పక్కన కూర్చుని ఉన్నప్పుడు సిద్ధార్థ పైన ఏదో ఒక సెటైర్ వెయ్ అంటూ చెబుతూ వచ్చేవాళ్ళు. నేను వాళ్ళింట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెరిగాను నన్ను కూడా ఆయన అలానే ట్రీట్ చేశారు. ఆయనతో ఈరోజు కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు తమన్.
Also Read : Triptii Dimri: తృప్తి దిమ్రీ ఖాతాలో మరో రికార్డ్.. వారందరినీ వెనక్కి నెట్టేసిందిగా!