BigTV English

Borewell Incident: బోరుబావిలో 16 గంటలు.. బిడ్డ నరకం.. పూజల్లో తల్లి.. చివరికి మృత్యువు ఒడిలోకి!

Borewell Incident: బోరుబావిలో 16 గంటలు.. బిడ్డ నరకం.. పూజల్లో తల్లి.. చివరికి మృత్యువు ఒడిలోకి!

Borewell Incident: తన కొడుకు ఆడే ఆటలు చూసి, ఆ తల్లి మురిసిపోయింది. అలా మురిసిపోయిన ఆ తల్లి ఇంట్లోకి వెళ్లింది. కొద్దిక్షణాల్లో బయటకు వచ్చి, బిడ్డ ఎక్కడా అంటూ మనసులోనే ప్రశ్నించుకుంది. అలా పొరుగు ఇళ్ల వైపు వెళ్లి ఉంటాడని ఆ తల్లి భావించింది. గంటల సమయం పడుతోంది. బిడ్డ మాత్రం ఇంటికి రాలేదు. ఆ తల్లి ఎదురుచూపులు మాత్రం, దారివైపే ఉన్నాయి. బిడ్డ రాలేదంటూ గాలించింది. కాసేపయ్యాక ఒక క్షణం మదిలో అనుమానం మొదలైంది. ఆ అనుమానమే నిజమైంది. బోరుబావిలో కొడుకు ఆర్తనాదాలు విన్న ఆ తల్లి గుండె గుభేల్‌‌‌‌‌‌మంది. 16 గంటలు బిడ్డ క్షేమంగా వస్తాడని ఎదురుచూసిన ఆతల్లి ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ జిల్లాలో జరిగింది.


గుణ జిల్లా పిప్లియా గ్రామంకు చెందిన పదేళ్ల బాలుడు సుమిత్, ఇంటి వద్ద శనివారం సాయంత్రం ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఇంటి వద్దే ఆడుకుంటున్న చిన్నారిని చూసిన తల్లి, అలా ఇంటిలోకి వెళ్లింది. సాయంత్రం వేళ ఎవరూ బయట లేరు. పదేళ్ల సుమిత్ మాత్రం అలా ఆడుకుంటూ, సమీపాన గల బోరుబావి వద్దకు వెళ్లాడు. అలా వెళ్లాడో లేదో, లోపలికి తొంగి చూసే క్రమంలో జారిపడ్డాడు. బిడ్డ ఆడుకుంటూ ఉన్నాడని భావించిన తల్లి, ఒక్కసారిగా బయటకు వచ్చి బిడ్డ కోసం వెతికింది. ఏం లాభం.. అప్పటికే సుమిత్ బోరుబావిలో పడ్డాడు.

బోరున విలపించి సుమిత్ తల్లి, వెంటనే గ్రామస్థులకు విషయం తెలిపింది. కుటుంబ సభ్యులందరూ.. సుమిత్ అరుపులు విన్నారు. ఇక ఆలస్యం చేయకుండా, అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు, ఆపరేషన్ ప్రారంభించారు. బిడ్డ బ్రతకాలని ఆ తల్లి పడే ఆవేదన అంతా ఇంతా కాదు. నా బిడ్డను బ్రతికించండి అంటూ అధికారుల వెంటపడింది ఆ తల్లి. అధికారులు కూడా యుద్ద ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూనే ఉన్నారు. ముందుగా సుమిత్ కి శ్వాస అందేందుకు ఆక్సిజన్ పంపే ప్రయత్నం చేశారు. ఓ వైపు ప్రొక్లైన్ తో త్రవ్వకాలు ప్రారంభించారు. ఊరు ఊరంతా 16 గంటలు బిడ్డ బ్రతకాలని మొక్కని దేవుడు లేడు.


Also Read: Refund Rules: ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా? రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకోండి..

చివరికి అధికారులు, సుమిత్ ను బయటకు తీశారు. బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని ఆ తల్లి పూజలను, ఏ దేవుడు ఆలకించలేదేమో కానీ, సుమిత్ లో ఎటువంటి కదలిక లేదు. హుటాహుటిన అధికారులు స్థానిక వైద్యశాలకు తరలించగా, అప్పటికే సుమిత్ చనిపోయినట్లు ధ్రువీకరించారు. సుమిత్ బ్రతకాలని ఊరుఊరంతా అన్నం, నీళ్లు ముట్టకుండా అధికారులకు సహకరించారు. చివరికి ఆ తల్లికి కడుపుకోత మిగిలిపోవడంతో, ఊరంతా రోదించింది. 16 గంటలు అధికారులు నిద్రాహారాలు లేకుండా శ్రమించినా, పదేళ్ల సుమిత్ ప్రాణం దురదృష్టవశాత్తు కాపాడలేక పోయారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న బోరుబావులను పూడ్చాలని అధికారులు సూచించారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×