AFG VS AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament) నేపథ్యంలో… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య…. ఇవాళ లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా రసవత్తర పోరు జరగనుంది. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో సెమీఫైనల్ కు వెళ్లాలంటే.. ఈ మ్యాచ్ లో రెండు జట్లు గెలవాల్సి ఉంటుంది. ఏ జట్టు ఓడిపోయిన ఇంటికి వెళ్లడం గ్యారంటీ. గెలిచిన జట్టు… సెమీస్ ఆశలను మరింత పెంచుకుంటుంది.
Also Read: Ban vs Pak: పాకిస్తాన్ ను కాపాడిన వరుణుడు.. లేకపోతే బంగ్లా చేతిలో పరువు పోయేదే?
ఉదాహరణకు ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో ( Australia vs Afghanistan match ) కంగారులు గెలిస్తే… వాళ్ల ఖాతాలో ఐదు పాయింట్లు పడతాయి. రన్ రేట్ కూడా పెరుగుతుంది. దీంతో నేరుగా సెమీఫైనల్ కు వెళ్తుంది. అలాగే… ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో ప్రస్తుతానికి రెండు పాయింట్లు ఉన్నాయి. ఇందులో గెలిస్తే నాలుగు పాయింట్లు అవుతాయి. రన్ రేట్ మైనస్ లో ఉంది. అది ప్లస్ లోకి వస్తుంది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మార్చి ఒకటో తేదీన.. మ్యాచ్ ఉంది. అందులో సౌత్ ఆఫ్రికా ఓడిపోతే ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
అది కూడా ఆస్ట్రేలియా పైన గెలిచి రెడీగా ఉండాలి. అప్పుడే ఆఫ్గనిస్తాన్ కు అవకాశాలు ఉంటాయి. ఒకవేళ.. ఇవాల్టి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే.. మార్చి ఒకటో తేదీన సౌత్ ఆఫ్రికా గెలవకుండా… సెమీ ఫైనల్ కి వెళుతుంది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే రన్ రేట్ ప్రకారం సౌత్ ఆఫ్రికా నేరుగా సెమి ఫైనల్ కి వెళ్తుంది. కాబట్టి ఇవాల్టి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ కు చాలా కీలకము. కచ్చితంగా గెలవాల్సిందే.
మ్యాచ్ ఉచితంగా ఎలా చూడాలి ?
ఇది ఇలా ఉండగా భారత కాలమానం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమవుతుంది. జియో హాట్ స్టార్ వేదికగా ఈ మ్యాచ్ ఫ్రీగా చూడవచ్చు. స్పోర్ట్స్ 18 అలాగే స్టార్ స్పోర్ట్స్ వేదికగా కూడా మనం మ్యాచులు చూడవచ్చు. జియో హాట్ స్టార్… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటును ఉచితంగానే ప్రసారం చేస్తోంది. ఈ ఆఫర్ కేవలం జియో నెంబర్ ఉన్న వారికి మాత్రమే అని సమాచారం.
Also Read: Champions Trophy 2025: భద్రతా లోపం.. గ్రౌండ్లోకి ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ జెర్సీతో ఎంట్రీ ?
ఆఫ్ఘనిస్తాన్ VS ఆస్ట్రేలియా జట్ల వివరాలు:
ఆఫ్ఘనిస్తాన్ ప్రాబబుల్ XI: రహ్మానుల్లా గుర్బాజ్ (w), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (c), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూ
ఆస్ట్రేలియా ప్రాబబుల్ XI: మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (c), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (w), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్