NaaNaa Hyraanaa Song : సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవుతున్న సినిమాలలో మంచి అంచనాలను సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావలసి ఉంది. కొన్ని కారణాల వలన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది చిత్ర యూనిట్. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఒక్కొక్క పాటను రిలీజ్ చేసే పనిలో పడింది టీం. ఈ సినిమా నుంచి ఇదివరకే రెండు మాస్ బీట్ ఉన్న సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సాంగ్స్ రెండు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి రీసెంట్ గా నానా హైరానా అనే ఒక మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు.
ఈ పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయినప్పుడు చాలామంది విపరీతంగా ఈ పాట గురించి ఊహించుకున్నారు. వినగానే ఈ పాట ఎక్కింది. అయితే తమన్ చాలా రోజుల తర్వాత ఒక మెలోడీ బీట్ అందించాడు అంటూ చాలామంది సోషల్ మీడియా వేదిక పోస్ట్స్ కూడా వేశారు. ఈ ప్రోమో వీడియోని విపరీతంగా వైరల్ అయింది. మొత్తానికి నానా హైరానా అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఊహించినట్లుగానే ఈ పాట వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కార్తీక్, శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ పాటకు సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ పాట లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అయితే శంకర్ సినిమాలో ఒక విజువల్ వండర్ సాంగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలో నానా హైరానా పాట అలానే ఉండబోతుందని చాలామంది ఊహిస్తున్నారు.
Also Read : Pushpa 2 Censor: కిక్ ఇచ్చే సీన్స్ కట్.. పుష్ప రాజ్‌కు షాక్ ఇచ్చిన సెన్సార్
ఇక ఈ పాట విషయానికి వస్తే పాట వినడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఈ లిరికల్ వీడియో కి సంబంధించిన కొన్నిచోట్ల మాత్రం పాతరకం ఎడిటింగ్ ను ఎడిట్ చేశారు. పాత కాలంలో పెళ్లిలు, ఓణీ ఫంక్షన్స్ కి చేసినట్టు ఉన్నాయి. లిరికల్ వీడియోలో ఇలా ఉంటే పర్వాలేదు కానీ పొరపాటున సినిమాలో ఇలా ఉంటే మాత్రం చరణ్ ఫ్యాన్స్ దీనిని జీర్ణించుకోలేరు. అయితే సాంగ్ లో మాత్రం మధ్యలో వచ్చే కొన్ని విజువల్స్ మాత్రం వండర్ గాని అనిపిస్తున్నాయి. చరణ్ కనిపించే విజువల్స్ పై ఫోకస్ కంటే కూడా ఎక్కువగా కియారా కనిపించే విజువల్స్ పైన ఫోకస్ పెట్టారు అనిపించింది. ఇప్పుడు శంకర్ సినిమాలో ఉండే బ్యూటిఫుల్ విజువల్స్ ఈ సాంగ్ లో కచ్చితంగా కనిపిస్తాయి అని కొంతమంది నమ్ముతున్నారు. ఏదేమైనా పాట మాత్రం చాలా అద్భుతంగా ఉంది.
Also Read: Allari Naresh: నా లైఫ్ లో ఆ రిగ్రేట్ ఇప్పటికీ ఉండిపోయింది