BigTV English

Nabha Natesh:యాక్సిడెంట్ గురించి ఆల‌స్యంగా చెప్పిన న‌భా న‌టేష్‌

Nabha Natesh:యాక్సిడెంట్ గురించి ఆల‌స్యంగా చెప్పిన న‌భా న‌టేష్‌

Nabha Natesh:న‌భా న‌టేష్‌.. న‌న్ను దోచుకుందువ‌టే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు త‌ర్వాత తెలుగులో వ‌రుస అవ‌కాశాల‌నే ద‌క్కించుకుంది. ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టంతో అమ్మ‌డుకి అవ‌కాశాలు పెరిగాయి. డిస్కో రాజా, సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, అల్లుడు అదుర్స్‌, మ్యాస్ట్రో చిత్రాల్లో న‌టించి మెప్పించింది. అయితే ఏమైందో తెలియ‌దు కానీ.. ఉన్న‌ట్లుండి సినిమాల్లో న‌టించ‌టం మానేసింది. సోష‌ల్ మీడియాలో మాత్రం అడ‌పా ద‌డ‌పా సంద‌డి చేస్తూ వ‌చ్చిన ఈ బ్యూటీకి ఏమైంద‌ని సినీ ప్రేక్ష‌కులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అవ‌కాశాలు రాలేదేమోన‌ని స‌రిపెట్టుకున్నారు.


అయితే ఇన్ని రోజులు ఈ అమ్మ‌డు సినిమాలకు దూరంగా ఎందుకు ఉన్నాన‌నే విష‌యాన్ని చెబుతూ ఓ పోస్ట్ చేసింది. ఇంత‌కీ న‌భా న‌టేష్‌.. చెప్పిన రీజ‌న్ వింటే ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు. న‌భా నటేష్‌కి యాక్సిడెంట్ అయ్యింది. ‘‘నేను కొన్ని రోజులు యాక్టివ్‌గా లేను. న‌న్ను మీరంద‌రూ త‌ప్ప‌కుండా మిస్ అయ్యుంటారు. నేను కూడా మీ అంద‌రినీ మిస్ అయ్యాను. గ‌త ఏడాది నాకెంతో క్లిష్ట‌మైన‌ది. క‌ష్ట‌మైన‌ది. ఎందుకంటే చాలా పెద్ద‌ యాక్సిడెంట్ అయ్యింది. నా ఎడ‌మ చేతికి బ‌ల‌మైన గాయం అయ్యింది. ఎముక‌లు విరిగాయి. ఆప‌రేష‌న్స్ జ‌రిగాయి.

నేను ఊహించ‌లేని శారీర‌క‌, మాన‌సిక బాధ‌న‌ను అనుభ‌వించాను. ఈ గాయం కార‌ణంగా సినిమాల‌కు, మీ అంద‌రికీ దూరం కావ‌టం అనేది చాలా బాధాక‌ర‌మైన విష‌యం. అదంతా సులువు కాదు. అయితే మీ అంద‌రి ప్రేమ కార‌ణంగా నాలో వ‌చ్చిన ధైర్యంతో దాన్నంతా అధిగ‌మించాను. నేను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. మునుప‌టి కంటే శ‌క్తివంతంగా మీ ముందు నిల‌బ‌డ్డాను. హాలో 2023.. నీ కోసం నేను సిద్ధంగా ఉన్నాను’’ అంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసింది న‌భా న‌టేష్‌.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×