BigTV English

Minister Ponguleti sensation comments: మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్.. రెండు రోజుల్లో పేలనున్న పొలిటికల్ బాంబులు

Minister Ponguleti sensation comments: మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్.. రెండు రోజుల్లో పేలనున్న  పొలిటికల్ బాంబులు

Minister Ponguleti sensation comments: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయా? విపక్ష బీఆర్ఎస్ ఫైట్ చేయలేకపోతోందా? ఓ వైపు అధికార పార్టీ, మరోవైపు బీజేపీ స్పీడ్ పెంచాయా?మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని ఎందుకన్నారు? ఈ లెక్కన విపక్షానికి ఊహించని షాక్ తగులుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. మూసీ పునరుజ్జీవనంపై జర్నలిస్టులతో కూడిన టీమ్ అక్కడ పర్యటిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాకు మాట్లాడారు.

ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని చెప్పుకొచ్చారు మంత్రి. ఈ విషయంలో ఎంతటి వాళ్లైనా తప్పించుకోలేరని వివరించారు. సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధమయ్యాయన్నది అసలు సారాంశం. కక్ష సాధింపు కోసం కాదని, సాక్ష్యాధారాలతో చర్యలు ఉంటాయన్నారు.


ముఖ్యంగా ఫోన్‌ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలు ఉంటాయని చెప్పకనే చెప్పేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.  ఈ లెక్కన రాబోయే రోజుల్లో విపక్షానికి ఇబ్బందులు తప్పవన్నది మంత్రి మాట.

ALSO READ: కేటీఆర్ కొత్త ఫార్ములా.. ‘నోటి’కి బదులు నోటీసులతో జవాబు, ఈ ‘పరువు’ పంచాయతీలు ఎన్నాళ్లో?

మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్‌తో విపక్షం అలర్ట్ అయ్యింది. తమకు తెలిసిన అధికారుల ద్వారా ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాలేశ్వరం గురించి వివరాలు తెలుసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఆయా అంశాలపై నేడు లేదా రేపు న్యాయ నిపుణులతో సంప్రదించాలని ఆలోచన చేస్తున్నారట కీలక నేతలు.

బీఆర్ఎస్‌లో జరుగుతున్న వ్యవహారశైలిని ఆ పార్టీ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఇన్ని ఇబ్బందులైతే ఎలా అని కొందరు మాట్లాడుకోవడం మొదలైంది. మరో నాలుగు ఏళ్లు ఎలా నెట్టుకు రావాలంటూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు నేతలు. మొత్తానికి మంత్రి పొంగులేటి ఇచ్చిన సంకేతాలతో విపక్షం అలర్టయినట్టు కనిపిస్తోంది.

 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×