BigTV English

Kalki 2 : కల్కి 2 రిలీజ్ ఎప్పుడో అనౌన్స్ చేసిన నాగ్ అశ్విన్

Kalki 2 : కల్కి 2 రిలీజ్ ఎప్పుడో అనౌన్స్ చేసిన నాగ్ అశ్విన్

Kalki 2 : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో నాగ అశ్విన్ కూడా ఒకరు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగి. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా డీసెంట్ సక్సెస్ గా నిలిచింది. ప్రముఖ నిర్మాత అశ్వని దత్ ఇంకా సినిమాలు ఆపేద్దాం అనుకున్న తరుణంలో, వాళ్ల కూతుర్లు స్వప్న ప్రియాంక కలిసి స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను నిర్మించారు. ఈ సినిమా నాని కెరియర్ లో సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడుని అందించింది. ఈ సినిమా తర్వాత నాగి చేసిన సినిమా మహానటి.


బయోపిక్ పీక్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని బయోపిక్ సినిమాలు వచ్చినా కూడా మహానటి సినిమా స్థాయి వేరు. సావిత్రి గారి కథను కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు నాగి. ఇటువంటి కథతో కూడా ఆడియన్స్ ని తియాటర్ కి రప్పించొచ్చు అని నిరూపించాడు. దాదాపు థియేటర్స్ కి ఆడియన్స్ రావడం మానేశారు అనుకునే తరుణంలో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్ కు పరుగులు పెట్టించింది. సుకుమార్ లాంటి దర్శకులు కూడా ఎమోషనల్ అయిపోయి నాగ్ అశ్విన్ కి లెటర్స్ రాశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని చాలామంది దర్శకులు ఒకచోట చేరి ఈ సినిమా గొప్పతనాన్ని చెప్పారు. అంతటి గొప్ప సినిమా తర్వాత నాగి తెరకెక్కించిన సినిమా కల్కి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.


కల్కి 2 రిలీజ్

కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కల్కి 2 సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా దీనిపై స్పందించాడు నాగ్ అశ్విన్. ఒక తమిళ్ ఈవెంట్లో కల్కి వన్ రిలీజ్ అయినప్పుడు ఒక మూడు నాలుగు ప్లానెట్స్ అలైన్ అయ్యాయి. కల్కి టు రిలీజ్ అవ్వాలంటే కనీసం ఏడు ఎనిమిది ప్లానెట్స్ అలైన్ అవ్వాల్సి ఉంది అంటూ ఆ ప్రశ్నను చాలా తెలివిగా దాటేసాడు.

ప్లానెట్స్ అలైన్ అంటే గ్రహాల అమరిక (గ్రహ సంయోగం) అంటే, ఆకాశంలో ఒకే వరుసలో లేదా దగ్గరగా కనిపించే కొన్ని గ్రహాల సమూహం. ఇది సాధారణంగా సూర్యునికి ఒకే వైపున మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే దిశలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఈ దృగ్విషయం భూమి నుండి చూస్తే గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ వాస్తవానికి వాటి మధ్య చాలా దూరం ఉంటుంది.

Also Read : Nani: శైలేష్ కు క్లాస్ పీకిన నాని

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×