BigTV English

Nicholas Pooran : బంతి తగిలి అభిమానికి గాయం.. పూరన్ చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే

Nicholas Pooran : బంతి తగిలి అభిమానికి గాయం.. పూరన్ చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే

Nicholas Pooran : ఐపీఎల్ 2025లో భాగంగా ఇటీవలే లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు లక్నో గుజరాత్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.  లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ నికోలస్ పూరన్ మరోసారి తన సత్తా చాటాడు. గుజరాత్ బౌలర్లను అతడు చిత్తు చిత్తు చేశాడు. ప్రస్తుతం పురాన్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. అతని బ్యాట్ నుంచి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.


నికోలస్ పూరన్ సిక్స్ కొట్టడంతో ఓ ప్రేక్షకుడు గాయపడ్డాడు. ఆ వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో గాయపడిన ప్రేక్షకుడు తలకు కట్టు కట్టుకుని కనిపిస్తున్నాడు. అయితే, ఈ ప్రేక్షకుడి తలకు చాలానే కుట్లు పడ్డాయంట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గాయపడిన తర్వాత కూడా, ఆ అభిమాని చికిత్స చేయించుకుని, ఆ తర్వాత మ్యాచ్ చూడటానికి లక్నోలోని ఎకానా స్టేడియానికి తిరిగి వెళ్ళాడంట.  గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 7 సిక్సర్లు కొట్టాడు. వాటిలో ఒకటి ఈ ప్రేక్షకుడి తలకు తగిలింది.దీంతో నికోలస్ పూరన్ ఉదారత చాటుకున్నారు.

 


ఈనెల 12న లక్నోలో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో పూరన్ భారీ సిక్సర్ కొట్టారు. బంతి నేరుగా ఓ అభిమాని తలపై పడింది. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం కాగా నిర్వాహకులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇది తెలుసుకున్న పూరన్ వెంటనే ఆ వ్యక్తితో మాట్లాడి స్టేడియానికి రావాలని కోరారు. అతనితో మాట్లాడి ఆటోగ్రాఫ్ చేసిన క్యాప్ ను బహుమతిగా ఇచ్చారు పూరన్. దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ 8 మ్యాచ్ లు ఆడగా.. అందులో 5 మ్యాచ్ లలో విజయం సాధించింది. 3 మ్యాచ్ లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

 

ఇవాళ జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం పూరన్ అంతగా ప్రతిభ కనబరిచే లేదు. మార్క్రమ్, మిచెల్ మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు నికోలస్ పూరన్ అనే సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్‌లో పూరన్ బ్యాట్ నుంచి ఫోర్లు, సిక్సర్లు కనిపించాయి. అతను ఇప్పటి వరకు  5 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. ఆ మ్యాచ్ లో  లక్నో సూపర్ జెయింట్స్  తుఫాన్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ 34 బంతుల్లో 61 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ 179.41 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 1 ఫోర్, 7 సిక్సర్లు కొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, లక్నో సూపర్ జెయింట్స్  19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×