BigTV English

Nag Aswhin: కల్కి యూనివర్స్ లో కృష్ణుడు ఫేస్ చూపించకూడదు అనుకున్న, లేకుంటే మహేష్ బాబు…

Nag Aswhin: కల్కి యూనివర్స్ లో కృష్ణుడు ఫేస్ చూపించకూడదు అనుకున్న, లేకుంటే మహేష్ బాబు…

Nag Aswhin: 2024లో విడుదలైన అత్యధిక భారీ బడ్జెట్ సినిమా కల్కి. నాగ్ అశ్విని దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఏ సినిమా మొదటి షో పడినప్పుడు నుంచి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మీద పెద్దగా నెగిటివ్ రివ్యూస్ ఏమీ లేవు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది పురాణ ఇతిహాసాల గురించి డిస్కషన్ పెట్టడం మొదలుపెట్టారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. అప్పటివరకు ట్విట్టర్ వేదికగా అందరూ మా హీరో గొప్ప మా హీరో గొప్ప అటువంటి పోస్ట్లు వేస్తూ ఉండేవాళ్ళు. కానీ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత కర్ణుడు కృష్ణుడు అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇకపోతే కల్కి సినిమాలో కృష్ణుడికి ఇచ్చిన ఎలివేషన్ అందరికీ తెలిసిన విషయమే. కానీ కృష్ణుడు ఫేసును మాత్రం ఎక్కడ చూపించలేదు. చాలామంది పార్ట్ 2 లోను ఇంకా ముందు ముందు కృష్ణుడు ఫేస్ రీవీల్ చేస్తారు అని చాలామంది ఊహించరు. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం కృష్ణుడి ఫేస్ రీవీల్ చేయకుండా మాత్రమే ఉంచాలి అనుకుంటున్నాను అనే క్లారిటీ ఇచ్చేశాడు.


కల్కి సినిమాలో కృష్ణుడిగా ఎవరినైనా పెట్టాలి అనుకుంటే ఎవరిని పెడతారు అని అడిగినప్పుడు, ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని పెడతాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక మహేష్ బాబు కృష్ణుడు పాత్రలో నటిస్తున్నాడు అనగానే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. అంతేకాకుండా 2000 కోట్లు వసూలు చేస్తుంది అని యాంకర్ అనగానే అవును అన్నట్టు చెప్పుకొచ్చారు నాగ అశ్విన్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. మామూలు మనిషిలా ఉంటూ దేవుడలా ఎలివేషన్ ఇవ్వటం తనకు బాగా నచ్చిందని. అటువంటి పాత్ర కంప్లీట్ గా ఒకటి డిజైన్ చేసి చేస్తే అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అని నాగ్ అశ్విన్ తెలిపారు.

Also Read : Kalki Movie : కల్కి లో మహాప్రస్థానం కవితా ఎందుకు చెప్పించా అంటే..


ఇక రీసెంట్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూలో కల్కి 2 సినిమా గురించి చాలా మాట్లాడారు. వాస్తవానికి కల్కి 2 సినిమా ఎప్పుడు మొదలు పెడుతున్నామో తనకే క్లారిటీ లేదు అంటూ కూడా తెలిపాడు. అలానే అనుదీప్ నాకెందుకు లైఫ్ ఇచ్చారు అని ఒక వీడియో బైట్ లో అడిగినప్పుడు, నీకు లైఫ్ ఇవ్వకపోతే లైఫ్ ఒక జిందగీ అయిపోతుంది మామ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. తను అనుదీప్ మిస్డ్ కాల్ అనే షార్ట్ ఫిలిం చూసి విపరీతంగా కనెక్ట్ అయ్యానని అది నమ్మి తనకు ఒక అవకాశం ఇచ్చానని చెబుతూ వచ్చాడు. అంతేకాకుండా ఆ సినిమాను ఓటీటీకి ఇచ్చేయమని చాలా మంది చెప్పిన కూడా, లేదు ఈ సినిమా థియేటర్లో వర్కౌట్ అవుతుంది. అని పట్టు పట్టి రిలీజ్ చేయించాము అంటూ నాగి క్లారిటీ ఇచ్చాడు.

Also Read : Kiccha Sudeep: ప్రభాస్, విజయ్ పై అలాంటి కామెంట్స్ చేసిన కన్నడ హీరో..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×