BigTV English
Advertisement

Kiccha Sudeep: ప్రభాస్, విజయ్ పై అలాంటి కామెంట్స్ చేసిన కన్నడ హీరో..!

Kiccha Sudeep: ప్రభాస్, విజయ్ పై అలాంటి కామెంట్స్ చేసిన కన్నడ హీరో..!

కిచ్చా సుదీప్(Kiccha Sudeep).. కన్నడ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన తెలుగులో రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమా ద్వారా విలన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో హీరోగా నాచురల్ స్టార్ నాని(Nani ), హీరోయిన్ గా పాన్ ఇండియా స్టార్ సమంత(Samantha )నటించారు. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విజయాన్ని అందుకొని రాజమౌళి పేరు నిలబెట్టింది. ఈ సినిమాలో విలన్ గా నటించిన కిచ్చా సుదీప్ కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేశారు. అలా క్రేజ్ సంపాదించుకున్న కిచ్చా సుదీప్ ప్రస్తుతం కన్నడలో తాను చేస్తున్న సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ మంచి పాపులారిటీ అందుకున్నారు. ఈ క్రమంలోనే ‘విక్రాంత్ రోణ’ అనే సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.


మ్యాక్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు..

ఇదిలా ఉండగా కిచ్చా సుదీప్ పూర్తిస్థాయి హీరోగా నటించిన చిత్రం ‘మ్యాక్స్’. కన్నడ నాట సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar), ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ కం హీరో కం విలన్ సునీల్(Sunil ) ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని వి క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్లపై తమిళ టాప్ ప్రొడ్యూసర్ అయిన కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ కార్తికేయ (Vijay Karthikeya) దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 27వ తేదీన ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా తెలుగులో చాలా గ్రాండ్గా థియేట్రికల్ విడుదల అయింది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కన్నడ నటుడు కిచ్చా సుదీప్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తెలుగు, తమిళ హీరోలపై కామెంట్లు చేశారు.


ప్రభాస్ గర్వం లేని వ్యక్తి..

అందులో భాగంగానే స్టార్ హీరోలైన ప్రభాస్(Prabhas), విజయ్ (Vijay) గురించి ప్రస్తావిస్తూ.. అభిమానులను సంబర పరిచారు కిచ్చా సుదీప్. తాజాగా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ప్రభాస్ ఒక మంచి వ్యక్తి. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తారు. సక్సెస్ అయినా.. ఫెయిల్యూర్ అయినా.. రెండింటిని ఆయన ఒకే విధంగా స్వీకరిస్తారు. కొంచెం కూడా గర్వం ఉండదు. అందుకే ఆయన నేడు స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు. అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సుదీప్.

విజయ్ గొప్ప కలలు కంటున్నారు..

అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)గురించి కూడా మాట్లాడుతూ..”ప్రస్తుతం నేను ఆయనతో కలిసి పనిచేస్తున్నాను. ఆయన ఎన్నో గొప్ప గొప్ప కలలు కంటున్నారు. ఆయన గొప్ప కలలు అన్నీ నిజమవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అంటూ కూడా తెలిపారు. ఏదేమైనా కిచ్చా సుదీప్ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక తమ అభిమాన హీరోల గురించి ఒక స్టార్ హీరో ఇలా కామెంట్లు చేయడంతో కిచ్చా సుదీప్ నిజాయితీకి ప్రశంసలు కురిపిస్తున్నారు.అలాగే ప్రస్తుతం కిచ్చా సుదీప్ నటించిన ఈ ‘మ్యాక్స్’ చిత్రం మరింత విజయం కావాలని కూడా కోరుకుంటున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×