Kalki Movie : గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూసిన కల్కి సినిమా ఎట్టకేలకు 2024లో విడుదలైంది. అయితే ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడు ఫ్యాన్ వార్స్ చేసే చాలామంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మైతిలాజికల్ డిస్కషన్ పెట్టారు. కృష్ణుడు కర్ణుడు అంటూ పెద్ద ఎత్తున ట్విట్టర్ వేదికగా చర్చలు జరిగాయి. ఈ సినిమాకి సంబంధించి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఈ సినిమాలో యస్కిన్ అనే పాత్రలో కనిపించాడు కమల్ హాసన్. ఈ పాత్ర సినిమాలో ఎంత అద్భుతంగా వర్కౌట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ ను చూస్తేనే చాలామందికి వణుకు పుట్టింది. అంత అద్భుతంగా ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు నాగి. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో యస్కిన్ శ్రీ రాసిన మహాభారతంలోని ఒక కవితను చెబుతాడు. అసలు ఆ కవితను ఎందుకు పెట్టించాను అని రీసెంట్. ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు నాగ్ అశ్విన్.
జగన్నాథుని రథచక్రాల్ వస్తున్నాయి,
రథచక్ర ప్రళయఘోష
భూమార్గం పట్టిస్తాను !
భూకంపం పుట్టిస్తాను !
ప్రముఖ కవి శ్రీ శ్రీ రాసిన మహాప్రస్థానంలోని జగన్నాథుని రథచక్రాలు అనే కవితలు పై మాటలు వినిపిస్తాయి. ఈ మాటలను కమలహాసన్ ఎందుకు చెప్పించాను అంటే మరో ప్రపంచాన్ని యస్కిన్ సృష్టించబోతున్నాను అనే ఇంటెన్షన్ తో ఇది చెప్పాము. ఇది కంప్లీట్ గా లేకపోయినా కూడా డబ్బింగ్ టైంలో ఇలా చెప్పించాము. ప్రత్యేకించి ఇంకేమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. గతంలో చాలా సందర్భాలలో ఈ కవితను కమలహాసన్ గారు చెప్పారు.సినిమాలో ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది అని నాగి తెలిపాడు.
Also Read : Allu Arjun: క్యూ కడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్స్.. ఏకంగా బ్లాంక్ చెక్ లతో..
కమల్ హాసన్ విషయానికి వస్తే పలు సందర్భాలలో శ్రీశ్రీ మీద ఉన్న ప్రేమను తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలా చందర్ దర్శకత్వం వహించిన ఆకలి రాజ్యం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో కమలహాసన్ (Kamal haasan) శ్రీశ్రీకి వీరాభిమాని. శ్రీ శ్రీ రాసిన మహాప్రస్థానం కవితలను ఈ సినిమాలో గుక్క తిప్పుకోకుండా చెబుతూ ఉంటాడు. చాలామంది తెలుగు ప్రేక్షకులకు శ్రీశ్రీ యొక్క వ్యాల్యూను చెప్పిన సినిమా ఆకలి రాజ్యం అని చెప్పొచ్చు. ఈ సినిమా మంచి హిట్ అవడం మాత్రమే కాకుండా శ్రీ శ్రీ స్థాయిని కూడా అమాంతం పెంచింది. ముఖ్యంగా కమల్ హాసన్ నటించిన తీరు ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక కల్కి సినిమాలో శ్రీ శ్రీ కవిత వినిపించినప్పుడు కూడా చాలామందికి ఒక హై ఫీల్ వచ్చింది అనేది వాస్తవం.