BigTV English

Nagachaitanya-sobhita engagement: ఆమెతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! కొంతమందికి మాత్రమే..

Nagachaitanya-sobhita engagement: ఆమెతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! కొంతమందికి మాత్రమే..

Nagachaitanya-Sobhita engagement(Tollywood celebrity news): ఎట్టకేలకు టాలీవుడ్ హీరో నాగచైతన్య కన్వీన్స్ అయ్యాడు. మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. గురువారం చైతూ ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు తెలు స్తోంది. అతి కొంతమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించి పనులు చకచకా జరిగిపోతున్నాయి.


అక్కినేని ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ హీరో నాగచైతన్య మరోసారి పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఇంతకీ వధువు ఎవరోకాదు.. ఫేమస్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. వీరిద్దరికీ గురువారం ఎంజేగ్‌మెంట్ జరగనుంది. ఇందుకు సీనియర్ హీరో నాగార్జున ఇల్లు వేదిక కానుంది. ఏర్పాటు దాదాపుగా పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కొంతమంది మాత్రమే హాజరుకానున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం.

చాన్నాళ్ల కిందట చైతూ-శోభిత రిలేషన్ షిప్‌లో ఉన్నారు. కలిసే ఫారెన్ వెకేషన్స్‌కు వెళ్లారు. కాకపోతే ఇదంతా గుట్టుచప్పుడుగా సాగింది. వీరిని పలు ప్రాంతాల్లో చూసినవాళ్లు, కొత్త ప్రాజెక్టు చేస్తున్నారేమోనని భావించారు. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్ ఓకే కావడం హాట్ టాపిక్‌గా మారింది.


ALSO READ: విరాట్ కోహ్లీ ప్రేమలో మృణాల్.. అనుష్క పరిస్థితి ఏంటి.. ?

శోభిత ధూళిపాళ్ల గురించి చెప్పనక్కర్లేదు. దశాబ్దం కిందట ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచు కుంది. ఈ క్రమంలో గ్లామర్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఎనిమిదేళ్ల కిందట రామన్ రాఘవ్ సినిమా లో తొలిసారిగా నటించింది. తెలుగుతోపాటు పలు సినిమాల్లో నటించిందామె. గూఢచారి, మేజర్ చిత్రాల్లో కీలకపాత్ర పోషించింది కూడా.

ఇక నాగచైతన్య విషయానికొద్దాం.. ఏ మాయ చేసావో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో, అందులోని హీరోయిన్‌గా నటించిన సమంతను లవ్ చేశాడు. ఇద్దరు మనసులు కలిశాయి. పెళ్లి చేసుకావాలని నిర్ణ యించుకున్నారు. పెద్దలు కూడా ఓకే చెప్పేశారు.

2017 ఏడాది అక్టోబర్ ఆరున గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. ఏం జరిగిందో తెలీదుగానీ ఆ బంధం ఎక్కువకాలం నిలవలేదు. నాలుగేళ్లు తర్వాత సరిగ్గా పెళ్లిరోజు విడిపోతున్నట్లు ప్రకటన చేసి, అభిమాను లను షాక్‌కు గురిచేశారు. ఆ తర్వాత చైతూ తన సినిమాలతో బిజీ అయిపోయాడు. ఈ సమయంలో శోభితతో పరిచయం, ఫ్రెండ్‌షిప్ ఎంగేజ్‌మెంట్‌కు దారితీసిందన్నది సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×