BigTV English

Kali river collapsed: ముక్కలైన కాళీ బ్రిడ్జి.. అసలేం జరిగింది?

Kali river collapsed: ముక్కలైన కాళీ బ్రిడ్జి.. అసలేం జరిగింది?

Kali river bridge collapsed(Telugu news headlines today): భారీ వర్షాలు కర్ణాటక, గోవాలను ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఉత్తర కన్నడ ప్రాంతంలో కాళి బ్రిడ్జి ముక్కలైంది. ఈ వంతెన రెండు రాష్ట్రాలకు కీలకమైంది. ఇటు కర్ణాటక-అటు గోవాలను కలుపుతుంది.


కర్ణాటక-గోవా రాష్ట్రాలను కలిపేందుకు కీలకంగా మారిన కాళీ వంతెన మంగళవారం అర్థరాత్రి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఘటన సమయంలో బ్రిడ్జిపై వెళ్తున్న భారీ ట్రక్కు నదిలో పడిపోయింది. అయితే సమీపంలోని మత్య్సకారులు నదిలో వాహనం పడిపోవడాన్ని గమనించారు.

వెంటనే వంతెన వద్దకు వెళ్లి నదిలోపడిన డ్రైవర్‌ను కాపాడారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వంతెన పైకి వాహనాలు రాకుండా చెక్ పోస్టు సిబ్బందిని అప్రమత్తం చేశారు.


ALSO READ: ఐదో అంతస్తు నుంచి పడ్డ కుక్క.. బాలిక దుర్మరణం

ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ ప్రాంతంలో ఈ వంతెన ఉంది. రెండు రాష్ట్రాలను కలిపిన కాళీ నదిపై వంతెనను నిర్మించారు. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో కూలిపోయిందని ఉత్తర కన్నడ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. డ్రైవర్ తమిళనాడుకి చెందిన వ్యక్తి.

ఐదు దశాబ్దాల కిందట కాళీ వంతెనను నిర్మించారు. అక్కడక్కడ దెబ్బతింది. అధికారులు మరమ్మత్తులు చేశారు. ఈ రూట్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో దానికి సమాంతరంగా మరొక వంతెన నిర్మించా రు. కాకపోతే వాహనాలకు అనుమతి ఇవ్వలేదు. పాత వంతెనపైకి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.

 

 

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×