Naga Chaitanya:అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తాను నటించిన తండేల్ (Thandel) సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో.. ఈ సినిమాకు సంబంధించిన పలువిషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు. అందులో భాగంగానే తన సతీమణి శోభత ధూళిపాళ్ల (Shobhita dhulipala) గురించి కూడా చెప్పుకొచ్చారు. ఇక తన భార్య శోభిత ధూళిపాళ్ల తో తాను అన్ని విషయాలు ఎంతో ఆనందంగా పంచుకుంటానని చెప్పిన ఆయన, తాను పలు విషయాలలో అయోమయానికి గురైనప్పుడు తన భార్య సపోర్టుగా నిలుస్తుందని, సరైన సూచనలు ఇస్తుందని తెలిపారు.
శోభిత సలహాలను పాటిస్తాను..
ఈ మేరకు నాగచైతన్య మాట్లాడుతూ.. “శోభితతో జీవితాన్ని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆమెతో అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోవడం నాకు ఇష్టం. నా ఆలోచనలన్నింటినీ కూడా నేను ఆమెతో చెబుతూ ఉంటాను. నేను ఎప్పుడైనా సరే గందరగోళానికి గురైనప్పుడు, వెంటనే ఆమెను సంప్రదిస్తాను. నేను ఎప్పుడు ఒత్తిడికి లోనైనా సరే తనకు తెలిసిపోతుంది. దాంతో వెంటనే ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అంటూ అడుగుతుంది. అటు అన్ని విషయాలలో కూడా నాకు సలహాలతో పాటు సూచనలు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె అభిప్రాయాలు చాలా తటస్థంగా ఉంటాయి. నేను ఆమె నిర్ణయాన్ని కచ్చితంగా గౌరవిస్తాను. ప్రతిదీ ఆమె నిర్ణయం తర్వాతే కార్యరూపం దాలుస్తుంది ” అంటూ నాగచైతన్య తన భార్య గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. నాగచైతన్య రెండవ భార్య విషయంలో సంతోషంగా ఉన్నాడని అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్న వేళ.. నాగచైతన్య పై సమంత (Samantha) అభిమానులు మాత్రం మండిపడుతున్నారు.
చైతు పై సమంత ఫ్యాన్స్ ఫైర్..
ఇకపోతే శోభిత చెప్పిన మాట వింటానని, శోభిత తనకు అన్ని సలహాలు ఇస్తుందని నాగచైతన్య చెప్పడంతో సమంత అభిమానులు నాగచైతన్య పై మండిపడుతున్నారు. సమంత విషయంలో ఎందుకు మీరు నెగిటివ్గా ఆలోచించారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సమంత ఇన్ని రోజులు ఒక మంచి మార్గంలో నడవాలని సలహాలు ఇచ్చినప్పుడు, ఎందుకు ఆమె నిర్ణయాన్ని గౌరవించలేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా సమంతకు అన్యాయం జరిగిందని, నాగచైతన్య పై కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నాగచైతన్య తండేల్ మూవీ విశేషాలు..
ప్రస్తుతం నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) తో కలిసి తండేల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే వైజాగ్లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించగా.. ఈవెంట్ ను అభిమానులు సక్సెస్ఫుల్ చేశారు. ఇక ఈరోజు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉండగా.. ఈవెంట్ కాస్త క్యాన్సిల్ అయింది. ఇక దాంతో చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాని బన్నీ వాసు నిర్మించారు. అలాగే ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్న చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.