BigTV English

Naga Chaitanya: శోభిత కుటుంబం పై చైతూ అలాంటి కామెంట్స్..!

Naga Chaitanya: శోభిత కుటుంబం పై చైతూ అలాంటి కామెంట్స్..!

Naga Chaitanya.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగచైతన్య (Naga Chaitanya). ఇకపోతే నాగచైతన్య వృత్తిగత జీవితమే కాదు వ్యక్తిగత జీవితం కూడా తెరిచిన పుస్తకమే. ముఖ్యంగా ‘ఏ మాయ చేసావే’ సినిమాలో సమంతకు జోడీగా నటించి, ఆమెతో స్నేహం పెంచుకున్నారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి, దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత 2017 డిసెంబర్లో ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం హైదరాబాదులో సపరేట్ అపార్ట్మెంట్ కి కూడా షిఫ్ట్ అయిన వీరు ఎంతో అన్యోన్యంగా కనిపించారు. కానీ ఏమైందో తెలియదు కానీ 2021 అక్టోబర్ 2న సడన్ గా విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.


సమంతాతో విడాకులు..

ఇకపోతే విడాకుల సమయంలో చాలామంది సమంతను టార్గెట్ చేస్తూ ఎన్నో రకాల విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డారు. అయితే నాగచైతన్య మాత్రం ఆ మరుసటి ఏడాదే ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా లండన్ లో ఒక హోటల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో అప్పుడే మీడియాలో వార్తలు కోడై కూశాయి. కానీ ఈ విషయంపై వారు స్పందించలేదు. కానీ ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక అక్కినేని నాగార్జున వీరిద్దరి నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


పెళ్లితో ఒక్కటి కానున్న అక్కినేని నాగచైతన్య – శోభిత:

ఇక ఎట్టకేలకు ఈ జంట పెళ్లికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 4 అనగా రేపు అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి మరీ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వీరి వివాహం జరిపించబోతున్నారు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో అటు నాగ చైతన్య, ఇటు శోభిత ఇద్దరికీ మంగళస్థానాలు పూర్తి చేశారు. మరొకవైపు పెళ్లి పనులు కూడా దాదాపు ప్రారంభం అయ్యాయి. బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరగబోతోందని సమాచారం. తాజాగా శోభిత ధూళిపాళ్ల కూడా పెళ్లికూతురు గెటప్ లో చాలా అందంగా కనిపించింది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని నాగచైతన్య శోభిత కుటుంబం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

శోభిత కుటుంబంపై ప్రశంసలు..

ఇంటర్వ్యూలో భాగంగా శోభిత వివాహం తర్వాత సినిమాల్లో నటిస్తారా? అని అక్కినేని నాగచైతన్యను ప్రశ్నించగా..ఆయన మాట్లాడుతూ.. కచ్చితంగా నటిస్తుంది అని తెలిపారు. అలాగే ఆమె కుటుంబం గురించి మాట్లాడుతూ.. ప్రతి తెలుగింటిలాగే శోభిత కుటుంబం కూడా చాలా సంస్కారవంతమైన కుటుంబం. ఆప్యాయతతో కూడుకున్నది. నన్ను సొంత కొడుకు లాగా చూసుకుంటారు” అంటూ కాబోయే అత్తగారి కుటుంబం పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేశారు అక్కినేని నాగచైతన్య. మొత్తానికైతే శోభిత కుటుంబం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు అక్కినేని నాగచైతన్య.. అక్కినేని నాగచైతన్య నటించిన సినిమాల విషయానికి వస్తే.. తండేల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది విడుదల కాబోతోంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×