Thandel: ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న చందు మొండేటి (Chandu Mondeti) తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం తండేల్(Thandel). యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya), లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravindh) సమర్పణలో బన్నీ వాసు (Bunny vasu) ఈ చిత్రాన్ని దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు అసలు అంత మార్కెట్ లేని నాగచైతన్య కోసం.. ఆయన నటనను నమ్మి.. భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడం జరిగింది. అయితే నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతూ అటు దర్శకుడు కూడా ఈ సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినట్లు స్పష్టం అవుతుంది. దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ , పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వైజాగ్ లో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి విశేష స్పందన లభించింది. అటు ట్రైలర్ కూడా యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ , లైక్స్ సాధించిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. ఇక దీనికి తోడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy vanga) ముఖ్యఅతిథిగా విచ్చేసి సినిమాపై హైప్ భారీగా పెంచేశారు
రెమ్యూనరేషన్ తగ్గించుకున్న నాగ చైతన్య..
శ్రీకాకుళం మత్స్యకారుల నేపథ్యంలో జరిగిన జీవిత కథను సినిమాటిక్ గా తెరకెక్కించడం జరిగింది. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రియల్ తండేల్ తో పాటు పాకిస్తాన్లో దాదాపు 17 నెలల పాటు జైల్లో ఇరుక్కొని అష్ట కష్టాలు పడ్డ మత్స్యకారులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.ఇక ఇంతలా ఒక్కో సంఘటన ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటిస్తున్న నాగచైతన్య రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. సాధారణంగా రూ.100 కోట్ల బడ్జెట్ సినిమా అంటే అందులో హీరో రెమ్యూనరేషన్ భారీగా ఉంటుంది. కానీ నాగచైతన్య మాత్రం అటు నిర్మాతల గురించి ఆలోచించి చాలా తక్కువ తీసుకున్నట్లు సమాచారం.ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాగచైతన్య ఈ సినిమా కోసం కేవలం రూ.12 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి (Sai Pallavi).రూ .5కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం కోసం నాగచైతన్య రెమ్యూనరేషన్ తక్కువ తీసుకుంటుండడం పై నాగచైతన్య మంచి మనసుకి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
నాగచైతన్య, సాయి పల్లవి కాంబో రిపీట్..
ఇదిలా ఉండగా గతంలో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar kammula) దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. కులాంతర వివాహం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి ఒదిగిపోయి మరీ నటించారు ఇక వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఫిదా అయిన దర్శక నిర్మాతలు మళ్లీ ఈ కాంబినేషన్లోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అందులో భాగంగానే తండేల్ తో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయిపోయింది ఈ జంట.