BigTV English

Sekhar kammula : అరుదైన , అద్భుతమైన దర్శకుడు

Sekhar kammula : అరుదైన , అద్భుతమైన దర్శకుడు

Sekhar kammula : శేఖర్ కమ్ముల తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దొరికిన ఒక అరుదైన దర్శకుడు శేఖర్ కమ్ముల. అమ్మాయిల పాత్రను అందంగా వెండి ధరపై ఆవిష్కరించిన అతి తక్కువ మంది దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ప్రతి హీరోయిన్ కి ఒక ఇండిపెండెంట్ వాయిస్ ని అందించిన దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు అనుకునే టైంలో శేఖర్ కమ్ముల ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్ పాత్ర రూపు రేఖలు మార్చేశారు. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొని తెలుగు సినిమాలపై ఉన్న ఇష్టంతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమా తర్వాత శేఖర్ దర్శకత్వం వహించిన సినిమా ఆనంద్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించింది. ఆనంద్ ఓ మంచి కాఫీలాంటి సినిమా అని టైటిల్ కి తగ్గట్టు ఒక ఫ్రెష్ ఫీల్ ని క్రియేట్ చేసింది.


శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకు పోటీగా

శేఖర్ దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమాను చాలామందికి చెప్పాడు. అయితే ఎవరికి ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు. ఇకపోతే ఎట్టకేలకు విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా రిలీజ్ రోజు విడుదల అయింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకు టికెట్లు దొరకని చాలామంది. ఈ సినిమాను చూడటం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా బాగుండటం వలన ఒక మౌత్ టాక్ తో ఈ సినిమా హిట్ అయింది.


హ్యాపీ డేస్ తో మంచి గుర్తింపు

శేఖర్ కమ్ముల చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచాయి. అయితే శేఖర్ దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా శేఖర్ కెరియర్ లోనే పెద్ద హిట్ అని చెప్పొచ్చు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో శేఖర్ కమ్ముల చూసిన కాలేజ్ లైఫ్ ని అద్భుతంగా సినిమాలో చూపించాడు. ఈ సినిమా తర్వాత చాలామంది ఇండస్ట్రీలో నటులుగా నిలబడ్డారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. రీసెంట్ గా ఈ సినిమాను మరోసారి రిలీస్ కూడా చేశారు ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.

ఆహ్లాదకరమైన గోదావరి

గోదావరి అనగానే అందరికీ కాలువ గట్లు, కొబ్బరి చెట్లు, ప్రేమ అనురాగాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఎప్పటినుంచో తెలుగు సినిమాల్లో గోదావరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తూనే ఉన్నారు. అలానే ఆ అందాలను వెండితెరపై ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఇక బాబు దర్శకత్వంలో వచ్చిన అందాల రాముడు అనే సినిమా గోదావరిలోనే జరిగింది. గోదావరి నది అందాలను అద్భుతంగా ప్రజెంట్ చేశారు బాపు. అదే తరహాలో శేఖర్ కమ్ముల కూడా గోదావరి అనే టైటిల్ పెట్టి గోదావరి సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో గోదావరి అందాలను చూపించడం మాత్రమే కాకుండా. అంతర్లీనంగా అద్భుతమైన మెసేజ్ ను కూడా తెలుగు ప్రేక్షకులకు అందించాడు.

గోదావరి వెనక కథ

ఈ సినిమాలో కమలని ముఖర్జీ, సుమంత్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ముందుగా సీత పాత్ర కోసం ఎంతో మందిని ట్రై చేశారు కానీ కమలిని ఆ పాత్ర నాకోసమే పుట్టింది అంటూ చాలాసార్లు శేఖర్ కమ్ములతో అన్నారు. అలానే ప్రాజెక్టులో కూడా ఆవిడే వచ్చారు. ఈ సినిమా షూటింగ్ లో కమలినీకి మంచి రూమ్ ఇవ్వలేదని కమలని పేరెంట్స్ కూడా ఫోన్ చేసి శేఖర్ కమ్ములను తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇదేమైనా టైటానిక్ షిప్ ఆ.? అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అంటూ కమలిని ఆటపట్టించాడు శేఖర్.రామ్ పాత్రలో సుమంత్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. సీత పాత్రలో కమలని చాలామంది కుర్రకారుని ఆకర్షించింది. ఈ సినిమాకి ఎం ఎం రాధాకృష్ణ అందించిన సాంగ్స్ అద్భుతం. ప్రతి సాంగ్ కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. వేటూరి రాసిన ఈ సినిమాలోని “ఉప్పొంగేలే గోదావరి” పాట ఒక సూపర్ హిట్ గా నిలిచింది. రెండు లాంచీలు, 12 బోట్లు, 200 మంది యూనిట్ సభ్యులు తో గోదావరిలో షూటింగ్ స్టార్ట్ చేసారు. గోదావరి సినిమాలో ఒక కుక్క పాత్రకు మంచి రోల్ ఉంది. దాన్ని యానిమేషన్ లో క్రియేట్ చేసి ఆ కుక్కకు వాయిస్ ఓవర్ అందించారు శేఖర్ కమ్ముల. బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఈ సినిమా స్కోర్ చేయకపోయినా కూడా ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ ఫిలిమ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా మార్చి 1న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. నేడు శేఖర్ కమ్ముల పుట్టినరోజు సందర్భంగా ఆయన మరిన్ని మంచి సినిమాలు చేసి కెరీర్ లో ముందుకు వెళ్లాలని బిగ్ టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Also Read: Thandel: రెమ్యూనరేషన్ విషయంలో గ్రేట్ అనిపించిన చైతూ..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×