BigTV English

Naga Chaithanya : లక్ అంటే ఇదే.. ఒకేసారి ముగ్గురు స్టార్ డైరెక్టర్స్‌తో..

Naga Chaithanya : లక్ అంటే ఇదే.. ఒకేసారి ముగ్గురు స్టార్ డైరెక్టర్స్‌తో..

Naga Chaithanya : ప్రస్తుతం ఎక్కడ చూసినా అక్కినేని నాగచైతన్య(NagaChaithanya ) వినిపిస్తుంది. గత కోనేలుగా సరైన హిట్ మూవీ లేక సతమతమవుతున్న నాగచైతన్యకు తండేల్ ( Thandel ) మూవీ భారీ విజయాన్ని అందించింది. రీసెంట్ గా ఫిబ్రవరి 7 న థియేటర్లలోకి వచ్చేసిన ఈ చిత్రం మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది. దాంతో కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో రాబడుతుంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే 100 కోట్లు రాబట్టడం అంటే నాగచైతన్య సినిమాలకు మామూలు విషయం కాదు. గతంలో ఎన్నడు లేని విధంగా ఏ సినిమాకు దక్కని విధంగా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్తో రికార్డులను బ్రేక్ చేస్తుంది. అయితే ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నాగచైతన్య ఆ తర్వాత ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నాగచైతన్య అప్కమింగ్ సినిమాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. నాగచైతన్య ఒకటి రెండు సినిమాలు కాదు ఏకంగా ముగ్గురు డైరెక్టర్లను లైన్ లో పెట్టుకున్నాడు అంటూ ఇండస్ట్రీలో టాక్. మరి ఆ ముగ్గురు డైరెక్టర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం..


నాగ చైతన్య లేటెస్ట్ గా నటించిన తండేల్ చిత్రంతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేశారు నాగచైతన్య. మరోసారి నాగచైతన్య, చందూ మొండేటీ కాంబో రిపీట్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. త్వరలో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నట్లు. తెనాలి రామకృష్ణుడు స్టోరీతో సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు.. ‘విరుపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు(Karthik Verma Dandu)తో మిస్టరీ థ్రిల్లర్ చిత్రం.. ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఆర్కా మీడియా వర్క్స్‌(Arca Media Works)తో కూడా ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : డీలా పడ్డ ‘లైలా ‘.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?


ఈ మూవీలన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమాలతో పాటు ఓ హారర్ కామెడీ సినిమాను కూడా నాగచైతన్య చేయాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. మొత్తానికైతే నాగచైతన్య తంతే బూరెల బుట్టలో పడ్డట్టు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తండేల్ లో ఈయన పర్ఫామెన్స్ ను చూసి సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయని తెలుస్తుంది. నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోవడంతో ఆయన లక్కు పెరిగిందని అక్కినేని అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. ఏదైతేనేం నాగ చైతన్య కు మంచి టైం స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది. ఇక ఎక్కడా తడబడకుండా ముందుకు వెళ్తే బెస్ట్ అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×