BigTV English

Laila Collections : డీలా పడ్డ ‘లైలా ‘.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?

Laila Collections : డీలా పడ్డ ‘లైలా ‘.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?

Laila Collections : టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Viswaksen ) నటించిన రీసెంట్ మూవీ లైలా.. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి ( Sahu Garapati ) నిర్మించారు. బ్యూటిఫుల్ హీరోయిన్ ఆకాంక్ష శర్మ విశ్వక్ సేన్ కు జోడిగా నటించింది.. భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డీలా పడింది.. అనుకున్న సక్సెస్ ను అందుకోకపోగా విమర్శలు అందుకుంది. మూవీ టాక్ నెగిటివ్ గా ఉండటంతో కలెక్షన్స్ కు దెబ్బేసాయానే వార్తలు వినిపించాయి. మరి మూడు రోజులకు గాను ఎంత వసూల్ చేసిందో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


విశ్వక్ సేన్ ‘లైలా’ చిత్రానికి రూ.7.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ‘లైలా’ 2 రోజుల్లో కేవలం రూ.0.87 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.55 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.. అయితే మొదటి రోజు ఓపెనింగ్ డిస్పాయింట్ చేసింది. ఇక ఇప్పుడు అంత వసూల్ చెయ్యాలంటే ఏదైనా మ్యాజిక్ జరగాల్సిందే. లేదా ఓటీటి లోకి స్ట్రీమింగ్ కు తీసుకు రావాల్సిందే. టోటల్ కలెక్షన్స్ రెండు కోట్లు లోపే అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంత ఉందో తెలియదు. ఎందుకంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు.

Also Read : బాక్సాఫీస్ దగ్గర ‘తండేల్’ జాతర.. దుమ్ము దులిపేసిందిగా..


ఇదిలా ఉండగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూరంగా బోల్తా కొట్టడానికి కారణం కమెడియన్ పృథ్వీరాజ్ అంటూ వార్త అయితే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆయన రాజకీయాలను ఉద్దేశించి మాట్లాడటం వల్లే ఈ సినిమాకు పెద్ద మైనస్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్ కు ముందే అందరి నోళ్లల్లో నానిన లైలా ప్రేమికుల రోజు కానుకగా థియేటర్లలో విడుదలైంది. కానీ మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విశ్వక్ సేన్ లేడీ గెటప్పులో ఆకట్టుకున్నప్పటికీ నీరసమైన కథా కథనాలు ఆడియెన్స్ ను నిరాశ పర్చాయి.. ఇక సోషల్ మీడియాలో మొన్న బాయ్ కాట్ లైలా అని వినిపించగా, నేడు డిజాస్టర్ లైలా అని వినిపిస్తుంది.. దాంతో ఈ మూవీకి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని టాక్. మొత్తానికి గత ఏడాది విశ్వక్సేన్ మూడు సినిమాలతో పలకరించారు ఆ మూడు సినిమాలు పర్వాలేదనిపించాయి. ఈ ఏడాది వచ్చినా మొదటి సినిమా భారీ డిజాస్టర్ ని అందుకుంది. ప్రస్తుతమైతే విశ్వక్సేన్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నారంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది మరి దీనిపై హీరో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×