Naga Chaitanya-Shobhita.. గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ తమ ప్రేమ బంధాన్ని ఎక్కడ బయట పెట్టకుండా ఎట్టకేలకు ఈ ఏడాది రివీల్ చేశారు అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాల (Shobhita dhulipala). 2022 ఏప్రిల్ నెలలో తమ పరిచయం మొదలైందని, తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత తెలిపింది. శోభిత, నాగచైతన్య ప్రేమలో ఉన్నారని, రహస్యంగా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చినా.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ ఏడాది ఆగస్టు 8న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి తోడు ఈ ఫోటోలను అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)షేర్ చేయడంతో నిర్ధారణకు వచ్చారు.
పెళ్లితో ఒక్కటైన జంట..
అలా నాగచైతన్య – శోభిత రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు నిజం అయ్యాయి. నిశ్చితార్థం తర్వాత మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ జంట, డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివాహ సెట్ లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఇరువురు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అంతేకాదు దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswar Rao)విగ్రహం ముందు వీరి వివాహం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇకపోతే వివాహం అనంతరం అక్కినేని నాగార్జునతో కలిసి నూతన జంట శ్రీశైలం మల్లన్న భ్రమరాంబిక దేవీలను దర్శించుకున్న ఈ జంట ఇప్పుడు పలు ఈవెంట్లకు వెళ్తూ సందడి చేస్తున్నారు.
వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న జంట..
అందులో భాగంగానే తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు జంటగా ఇంటర్వ్యూ ఇచ్చిన వీరు.. తమ పరిచయం, ప్రేమ, పెళ్లి అన్ని ఎలా జరిగాయి అనే విషయాలపై ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రేమించుకున్న తర్వాత మొదట ఎవరు తమ ప్రేమను ఎదుటి వారికి ఎక్స్ప్రెస్ చేశారు? అనే ప్రశ్నకు శోభిత ఊహించని సమాధానం తెలిపింది. సాధారణంగా సెలబ్రిటీలు వివాహం తర్వాత ఇలాంటి విషయాలపై పెద్దగా స్పందించరు. అసలు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరు. అయితే శోభిత మాత్రం ప్రత్యేకంగా చైతన్యతో తన బంధం ఎలా మొదలైంది అనే విషయాలను రివీల్ చేస్తోంది.
అసలు విషయం దాచేసిందే..
ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా.. ఇద్దరిలో ముందుగా ఎవరు, ఎవరికి తమ ప్రేమ విషయాన్ని తెలియజేశారు? అని ప్రశ్నిస్తే మాత్రం సైలెంట్ అయింది ఈ ముద్దుగుమ్మ. గోవా పర్యటనలో భాగంగా పెళ్లి ప్రపోజల్ వచ్చినట్లు తెలిపింది. కానీ ముందుగా ‘ఐ లవ్ యూ” అని చెప్పి బుట్టలో వేసింది ఎవరు? అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ గానే ఉంచింది. ఇకపోతే హైదరాబాదు నుండి తరచూ నాగచైతన్య.. శోభిత కోసం ముంబైకి వెళ్లే వారట. అలా తొలిసారి చైతన్యను కలిసినప్పుడు అతను బ్లూ సూట్, తాను రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను అంటూ తెలిపింది. ఇక ఇక్కడో ప్రత్యేక కారణం వుంది అని చెప్పాలి. ప్రేమికుల మధ్య తొలి కలయిక జీవితాంతం గుర్తుండాలి అంటారు కదా అదే ఇది అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చింది శోభిత. ఏది ఏమైనా అక్కినేని కొత్త కోడలు అన్నీ చెప్పింది కానీ అసలు విషయాన్ని చెప్పకుండా దాచేసింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.