Komatireddy Fires on BRS: తెలంగాణలో రహదారుల అంశం అసెంబ్లీని కుదిపేసింది. దీనిపై సభ్యులు అడిగిన ప్రశ్నలపై తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈలోగా విపక్ష బీఆర్ఎస్ సభ్యులు చేసిన కామెంట్స్‌పై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
ఓఆర్ఆర్‌ను 7 వేల కోట్లకు అమ్మిందెవరని ప్రశ్నించారు మంత్రి. ఉప్పల్ ఫ్లైఓవర్ మొదలుపెట్టి ఇప్పటికి ఆరేన్నరేళ్లు అయ్యిందని, ఇంకా పూర్తి కాలేదన్నారు. అంతెందుకు కేసీఆర్ ఫామ్ హౌస్‌కు రోడ్డు కోసం రూ. 700 కోట్లు కేటాయించలేదా? అంటూ మండిపడ్డారు.
వాస్తవాలు చెబితే ఉలిక్కిపాటు ఎందుకంటూ మండిపడ్డారు సదరు మంత్రి. రీజినల్ రింగ్ రోడ్డును వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టాలన్నదే తమ ధ్యేయమన్నారు. హరీష్‌రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెలీదన్నారు.
కమిషన్లు తీసుకుని కూలిపోయేలా కాళేశ్వరం కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రహదారుల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం ముమ్మాటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. గడిచిన పదేళ్లు రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయంగా చేశారన్నారు.
ALSO READ: నోరు జారిన ఎమ్మెల్యే వివేకానంద.. మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం
గుంతల రోడ్డు చూపిస్తే రూ. 1000 ఇస్తామని కేటీఆర్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ క్రమంలో వెల్‌లోకి దూసుకొచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని వందేళ్లు విధ్వంసం సృష్టించారని అన్నారు.
ఈ సందర్భంగా మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంకెళ్లు వేసుకురావడంపైనా నోరు ఎత్తారు మంత్రి. అసలైన నాయకులు బేడీలు వేసుకోలేదని, అమాయకులకు వేయించారన్నారు. రేపోమాపో పోలీసులు వచ్చిన బేడీలు వేస్తారన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపనలపైనా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గట్టిగా కౌంటరిచ్చారు. సభలో సభ్యులు గొడవ చేయడంపై సెటైర్లు వేశారు. ఈ పిల్లలతో తానేం మాట్లాడాలి.. ప్రతిపక్ష నేత వస్తే మాట్లాడతానని అన్నారు. హరీశ్‌రావు మామ చాటు అల్లుడిగా ఉండి రూ.10 వేల కోట్లు దోచిన దొంగ అని మండిపడ్డారు.
ఈ సందర్భంలో ఎమ్మెల్యే హరీష్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సభకు కొంతమంది ఉదయాన్నే తాగి వస్తున్నారని, అసెంబ్లీలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. వెంటనే మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టారు తప్ప.. రహదారులను పట్టించుకోలేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రహదారుల నిర్మాణంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది
డీపీఆర్ లు ఇవ్వకుండా పనులు నిలిపేశారు
గతంలో గుంతల రోడ్ చూపిస్తే కేటీఆర్ రూ. వెయ్యి ఇస్తామన్నారు
పదేళ్లలో రాష్ట్రంలోని… pic.twitter.com/GLjYhTwHD1
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2024
అసెంబ్లీకి వచ్చే సభ్యులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలి..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
కొంతమంది సోయి లేకుండా మాట్లాడుతున్నారన్న హరీశ్ రావు pic.twitter.com/qhuN0cm8Q5
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2024