BigTV English

Naga Chaitanya Shobhita: కట్నం కింద ఎన్ని కోట్లు తెస్తోందో తెలుసా..?

Naga Chaitanya Shobhita: కట్నం కింద ఎన్ని కోట్లు తెస్తోందో తెలుసా..?

Naga Chaitanya Shobhita: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని ఫ్యామిలీలోకి త్వరలో కొత్త కోడలు రాబోతోంది. ఈమధ్య కాలంలో అక్కినేని నాగచైతన్య (అక్కినేని Naga Chaitanya) , హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala) తో ప్రేమలో పడి, చివరికి పెద్దలను ఒప్పించి, నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 8వ తేదీన బంధుమిత్రులు , స్నేహితుల మధ్య ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోంది. డిసెంబర్ 4 వ తేదీన వీరి పెళ్లి జరగబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఈ విషయంపై అక్కినేని కుటుంబం నుంచి కానీ శోభిత కుటుంబం నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


శోభిత కట్నం..

ఇకపోతే మరోవైపు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న అక్కినేని కుటుంబానికి , శోభిత ధూళిపాల కట్నం గా ఎంత తీసుకువెళ్తోంది అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లేని శోభిత ఎప్పుడైతే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుందో.. అప్పటినుంచి ఈమె పేరు భారీగా మారుమ్రోగుతోంది. ఇక పెళ్లి అనేసరికి ఎక్కడ చూసినా ఈమె గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కట్నం కింద ఎంత తీసుకొస్తుంది అంటూ వార్తలు రాగా.. ఈమె ఎలాంటి ఆస్తిపాస్తులు తీసుకురాకుండా కేవలం బంగారం మాత్రమే కట్నంగా తీసుకొస్తోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది.


కట్నంపై అక్కినేని ఫ్యామిలీ అలాంటి కామెంట్స్..

అయితే మరోవైపు అక్కినేని కుటుంబం తమకు ఎలాంటి డబ్బు, నగలు అవసరం లేదని, తమ కొడుకుకి భార్యగా, చక్కటి ఇల్లాలుగా, జీవితాంతం తోడునీడుగా ఉంటే చాలని చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా వేలకోట్ల ఆస్తులు ఉన్నా.. వైవాహిక జీవితంలో సంతోషం లేకపోతే అదంతా వృధా అవుతుంది. అందుకే కట్నం వద్దు తమ కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని అక్కినేని ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం.

పెళ్లికి హాజరయ్యే సెలబ్రిటీస్ వీరే..

ఇకపోతే వీరి వివాహానికి హాజరు కాబోయే సెలబ్రిటీల విషయానికొస్తే.. దగ్గుబాటి కుటుంబం, మెగా ఫ్యామిలీ, మహేష్ బాబు ఫ్యామిలీ లకు ప్రత్యేక ఆహ్వానాలు అందించినట్లు సమాచారం. అటు బాలీవుడ్ నుండి రణ్బీర్ ఫ్యామిలీ , అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీతో పాటు పలువురు స్టార్ సెలబ్రిటీలకు, కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారట. రాజమౌళితోపాటు అల్లు కుటుంబానికి అలాగే పలువురు స్టార్ డైరెక్టర్లకు, నిర్మాతలకు, సినీ నటులకు ఆహ్వానం పంపించినట్లు సమాచారం. ఇక వీరి వివాహం 22 ఎకరాలు కలిగిన అన్నపూర్ణ స్టూడియోలో చాలా ఘనంగా నిర్వహించనున్నారట . పెళ్లి కోసం భారీ సెట్టింగ్ కూడా రూపొందించినట్లు సమాచారం. ఇకపోతే ఈ విషయాలపై పూర్తి అప్డేట్ రావాలి అంటే అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×