AP Assembly sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు వస్తారా? లేక అధినేత దారిలో నడుస్తారా? ఆ భయంతో జగన్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ సమావేశాలను 10 రోజులపాటు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది చంద్రబాబు సర్కార్.
గతంలో మాదిరిగానే ఈసారీ సమావేశాలకు దూరంగా ఉండాలని ఆలోచన చేస్తుందట వైసీపీ. తొలిరోజు అంటే సోమవారం సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అనంతరం సమావేశాలు వాయిదా పడే అవకాశముంది. దీనికి మాత్రమే హాజరుకావాలని ఆలోచన చేస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇందులోభాగంగా శనివారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వం ప్రాధాన్యతలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఆయనను నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి.
ALSO READ: విజయవాడలో మార్కింగ్ వాకర్స్ నిరసన.. చివరకు తాళాలు పగలగొట్టి మైదానంలోకి వెళ్లి!
ఈసారి సభలో వైసీపీ సోషల్‌మీడియా గురించి ప్రజలకు వివరించాలని చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోందట. సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు పెట్టిన పోస్టులను లైవ్‌లో ప్రదర్శిస్తే.. వాళ్ల గురించి ప్రపంచానికి తెలుస్తుందనేది ఆలోచన. అదే జరిగితే పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవ్వడం ఖాయం.
వైసీపీ నేతలు వచ్చినా, రాకపోయినా సోషల్ మీడియా పోస్టుల గురించి లైవ్‌లో ప్రదర్శించడం ఖాయమని ప్రచారం సాగుతోంది. దీన్ని ముందుగానే పసిగట్టిన జగన్, అసెంబ్లీకి రానని సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. జగన్ రాకపోయినా ఆ పార్టీ నేతలైనా వస్తారా? అంటే చెప్పడం కష్టమేనని అంటున్నారు.
ఏదో విధంగా హడావుడి చేసి మీడియా అటెక్షన్‌ను తనవైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమావేశాలకు హాజరైనట్టు అటెండెన్స్ పడితే చాలన్నది ఫ్యాన్ పార్టీ నేతల ఆలోచన. మొత్తానికి సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు వైసీపీ ఆలోచన మారుతుందా లేదా అనేది చూడాలి.