BigTV English

Thandel: సరికొత్త రికార్డు సృష్టించిన ‘బుజ్జితల్లి’ సాంగ్..!

Thandel: సరికొత్త రికార్డు సృష్టించిన ‘బుజ్జితల్లి’ సాంగ్..!

Thandel:అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya), నాచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai pallavi)మళ్లీ జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘లవ్ స్టోరీ’ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. శేఖర్ కమ్ముల(Sekhar kammula) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ‘కార్తికేయ 2’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చందు మొండేటి(Chandu Mondeti )దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మత్స్యకార బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అల్లు అరవింద్ (Allu Aravindh) సమర్పణలో గీత ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు (Bunny Vasu)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.


రికార్డు సృష్టించిన బుజ్జితల్లి సాంగ్..

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘బుజ్జితల్లి’ అనే లిరికల్ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పాట అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో ఏకంగా 40 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు అందుకుంది.తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ విషయంపై నాగచైతన్య అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


విడుదల ఎప్పుడంటే..?

మరోవైపు ఈ సినిమా విడుదల తేదీ పై అధికారిక ప్రకటన ఎట్టకేలకు వచ్చేసింది. క్రిస్మస్ కే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారు. అలాగే సంక్రాంతి కైనా విడుదల చేస్తారని అనుకోగా.. ఇప్పుడు ఆ తేదీని కూడా మార్చుకోవడం జరిగింది.. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక తెలుగుతోపాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో పాన్ ఇండియా గా విడుదల కాంబోతోంది ఈ సినిమా. వాస్తవానికి సంక్రాంతి బరిలోకి ఈ సినిమా దిగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీ ఉండడంతో నిర్మాత అరవింద్ పోటీ నుండి వెనక్కి తగ్గినట్లు సమాచారం.

తండేల్ సినిమా కథ..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా.. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. P 2018లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీకాకుళం సాంస్కృతిక , సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలను ఈ సినిమా ప్రతిబింబించబోతోంది అని చెప్పవచ్చు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే ఒక జాలరి అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాలలోకి ప్రవేశిస్తాడు. దీంతో పాక్ నేవీ అధికారులు అతడిని అరెస్టు చేస్తారు.. ఈ ఘటనను ఆధారంగా చేసుకొని ఇప్పుడు తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఈ జాలరి ని తిరిగి ఇండియాకు రప్పించడానికి ఆయన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటి? అనేది ఈ సినిమా కథ. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×