BigTV English

Indian Team Schedule 2025: 2025లో టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ వచ్చేసింది..!

Indian Team Schedule 2025: 2025లో టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ వచ్చేసింది..!

Indian Team Schedule 2025: మరికొద్ది గంటలలోనే 2024 సంవత్సరం ముగిసిపోనుంది. ఈ 2024వ సంవత్సరం భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఒడిదుడుకుల మధ్య సాగింది. ఓవైపు భారత్ 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. మరోవైపు తొలిసారిగా స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో 3-0 తో ఓడిపోయింది. అంతేకాకుండా శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ లో ఓటమి చవిచూసింది. ఇక పలు ద్వైపాక్షిక సిరీస్ లను కూడా భారత జట్టు సొంతం చేసుకుంది.


Also Read: Navjot Singh Sidhu on Travis Head: వేలు పెట్టి గెలికేసిన ట్రావిస్ హెడ్.. రంగంలోకి ICC ?

అయితే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మెల్ బోర్న్ నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఓటమితో ఈ ఏడాదికి వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఇక సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియతో జరిగే ఐదవ టెస్ట్ తో 2005 కొత్త సంవత్సరాన్ని ప్రారంభించబోతోంది భారత జట్టు. ఈ ఐదవ టెస్ట్ జనవరి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు సాగనుంది. అయితే 2025లో భారత జట్టు ఎన్ని మ్యాచ్ లు ఆడబోతోంది..? ఏ ఏ జట్లతో ఆడుతుంది..? ఎప్పుడెప్పుడు ఆడుతుంది..? అనే వివరాలలోకి వెళితే.. సిడ్నీ వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్ట్ పూర్తి కాగానే.. ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడబోతోంది భారత జట్టు.


భారత్ – ఇంగ్లాండ్ టీ-20 సిరీస్ షెడ్యూల్:

1 టీ-20: జనవరి 22 (కోల్కతా)
2 టీ-20: జనవరి 25 ( చెన్నై)
3 టీ-20: జనవరి 28 ( రాజ్ కోట్)
4 టీ-20: జనవరి 31 ( పూణే)
5 టీ-20 : ఫిబ్రవరి 02 ( ముంబై)

ఇంగ్లాండ్ – భారత్ వన్డే సిరీస్ షెడ్యూల్:

1 వన్డే: ఫిబ్రవరి 6 (నాగపూర్)
2 వన్డే: ఫిబ్రవరి 9 ( కటక్)
3 వన్డే: ఫిబ్రవరి 12( అహ్మదాబాద్)

ఇంగ్లాండ్ తో సిరీస్ తర్వాత భారత జట్టు {Indian Team Schedule 2025} ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్ ల షెడ్యూల్:

బంగ్లాదేశ్ – ఇండియా: ఫిబ్రవరి 20 (దుబాయ్)
ఇండియా – పాకిస్తాన్: ఫిబ్రవరి 23 (దుబాయ్)
ఇండియా – న్యూజిలాండ్: మార్చ్ 2 (దుబాయ్)

గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో తదుపరి సెమీస్, ఫైనల్స్ ఉంటాయి.

ఇక మార్చ్ 14వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఐపీఎల్ సీజన్ 2025 జరుగుతోంది.

ఐపీఎల్ అనంతరం ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించబోతోంది.

1 టెస్ట్: జూన్ 20 – 24 (లీడ్స్)
2 టెస్ట్: జూలై 2 – 6 ( బర్మింగ్ హోమ్)
3 టెస్ట్ : జూలై 10 – 14 ( లాడ్స్)
4 టెస్ట్ : జూలై 23 – 27 (మాంచెస్టర్)
5 టెస్ట్ : జూలై 31 – ఆగస్ట్ 4 ( లండన్, కెన్నింగ్స్టన్ ఓవల్)

Also Read: Irfan Pathan on Rohith Sharma: కెప్టెన్ అయ్యి బతికిపోయాడు.. లేకపోతే రోహిత్ ను పీకి పడేసేవారు !

ఈ టెస్ట్ సిరీస్ తర్వాత జరిగే మ్యాచ్ లకు సంబంధించిన తేదీ, వేదికలు ఇంకా ఖరారు కాలేదు. షెడ్యూల్ ప్రకారం భారత జట్టు వచ్చే ఏడాది బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలతో కూడా సిరీస్ లు ఆడాల్సి ఉంది. ఆగస్టులో బంగ్లాదేశ్ తో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు. అక్టోబర్ లో స్వదేశంలో వెస్టిండీస్ తో రెండు టెస్ట్ లు. అక్టోబర్ లో స్వదేశంలో టి-20 ఫార్మాట్ లో ఆసియా కప్. అక్టోబర్ – నవంబర్ నెలలో ఆస్ట్రేలియా పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టి-20 మ్యాచ్ లు ఆడబోతోంది భారత జట్టు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×