BigTV English

Naga Vamsi: ఆ తప్పే గుంటూరు కారం సినిమాకి మైనస్.. నిర్మాత హాట్ కామెంట్స్..!

Naga Vamsi: ఆ తప్పే గుంటూరు కారం సినిమాకి మైనస్.. నిర్మాత హాట్ కామెంట్స్..!

Naga Vamsi: తెలుగు చలనచిత్ర పరిశ్రమకే పరిమితమై ఇక్కడ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కూడా ఒకరు. ఇప్పటివరకు వేరే ఇండస్ట్రీకి వెళ్లకుండా చాలా సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలోనే కొనసాగుతూ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న మహేష్ బాబు ఒకేసారి కుంభస్థలాన్ని ఢీకొట్టబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఏకంగా పాన్ వరల్డ్ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే చివరిగా ఈయన నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాపై నిర్మాత నాగ వంశీ (Naga Vamsi)పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.


ప్రీమియర్ షోలపై షాకింగ్ కామెంట్ చేసిన నిర్మాత..

అసలు విషయంలోకెళితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు నిర్మిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న సూర్యదేవరనాగ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే కొరటాల శివ (Koratala shiva), ఎన్టీఆర్ (NTR) కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమాకు నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో లాభాలు కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రీమియర్ షో ల గురించి నాగ వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. ఇందులో భాగంగానే ప్రీమియర్ షో ల వల్ల మంచి బెనిఫిట్ ఉంటుందని , ఎందుకంటే మేకింగ్ విధానం, ఎలివేషన్స్ , డైలాగ్ డెలివరీ ఇలా తదితర విషయాలలో క్లాస్ సినిమా మాస్ సినిమాకి చాలా తేడా ఉంటుందని, అందుకే మాస్ సినిమా ఉదయం సమయంలో చూడటం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరోవైపు క్లాస్ సినిమాలను మార్నింగ్ లేదా ఈవినింగ్ షో సమయంలో చూస్తే సినిమా టెక్నిక్స్, డైలాగ్స్ అన్ని బాగా అర్థం అవుతాయని, కానీ ఎందుకో చాలా మంది క్లాస్ సినిమాలకు ప్రీమియర్ షోలు గా వెయ్యరు అని కూడా తెలిపారు.


ఆ తప్పే గుంటూరు కారం కు మైనస్ గా మారింది..

ఇదిలా ఉండగా .. త్రివిక్రమ్(Trivikram )- మహేష్(Mahesh Babu)కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం(Guntur kaaram) చిత్రాన్ని మాస్ సినిమాగా ప్రమోట్ చేశామని, ఒకవేళ క్లాస్ సినిమాగా ప్రమోట్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.ఇక అదే గుంటూరు కారం సినిమాకు పెద్ద మైనస్ గా మారిందని కూడా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు నాగ వంశీ. ఒకవేళ క్లాస్ సినిమాగా ప్రమోట్ చేసి ఉంటే కలెక్షన్స్ ఇంకా వచ్చేవి అని చెప్పుకొచ్చారు.

రౌడీ హీరో మూవీని నిర్మిస్తున్న నాగవంశీ..

ఇక నాగ వంశీ విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో అనుభవం ఉన్న నాగవంశీ తదుపరి చిత్రాలతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×